iQOO Z9s Series: ఇదే కదా కావాల్సింది.. 50 MP కెమెరాతో ఐక్యూ నుంచి రెండు కొత్త స్మార్ట్‌ఫోన్లు..!
iQOO Z9s Series: iQOO ఆగస్ట్ 21న లో iQOO Z9s, iQOO Z9s Pro స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ చేయనుంది. వీటిలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంటుంది.
iQOO Z9s Series: ఐక్యూ ఆగస్ట్ 21న iQOO Z9s సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లను భారతదేశంలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ లైనప్‌లో రెండు మోడల్‌లు ఉన్నాయి. అందులో iQOO Z9s, iQOO Z9s Pro. ఈ స్మార్ట్‌ఫోన్‌ల గురించి చాలా సమాచారం ఇప్పటికే లీక్ అయింది. అయితే వాటిని నమ్మొద్దని కంపెనీ తాజాగా వెల్లడించింది. iQOO ఇండియా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న Z9s, Z9s ప్రో కోసం ల్యాండింగ్ పేజీ రెండు స్మార్ట్‌ఫోన్‌ల గురించి కీలక స్పెక్స్‌ను తెలియజేస్తుంది.
iQOO Z9s Pro
ఐక్యూ జెడ్9 ఎస్ ప్రో ల్యాండింగ్ పేజ్ ఆధారంగా 120Hz రిఫ్రెష్ రేట్, 400 nits లోకల్ పీక్ బ్రైట్‌నెస్‌ని అందించే కర్వ్‌డ్ AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఈ ఫోన్ లక్స్ మార్బుల్, ఫ్లాంబోయంట్ ఆరెంజ్ అనే రెండు కలర్స్‌లో వస్తుందని కంపెనీ తెలిపింది. అదనంగా iQOO Z9s ప్రో స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్‌సెట్‌పై వస్తుందని ల్యాండింగ్ పేజీ నిర్ధారిస్తుంది. ఫోన్ వెనుక ఉన్న డ్యూయల్-కెమెరా సెటప్ OIS సపోర్ట్‌తో 50 మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్‌ను కలిగి ఉంటుంది.
iQOO Z9s
ఈ సంవత్సరం ఏప్రిల్‌లో ప్రారంభించిన iQOO Z9 చైనీస్ వేరియంట్ రీబ్రాండెడ్ లేదా ట్వీక్ చేసిన వెర్షన్‌గా Z9s ప్రోని పరిచయం చేసే అవకాశం ఉంది. ఈ ఫోన్‌లో 6.78-అంగుళాల డిస్‌ప్లే, IP64-రేటెడ్ ఛాసిస్, స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 చిప్, LPDDR4x RAM, UFS 2.2 స్టోరేజ్, 80W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉన్నాయి.
ఫోన్ అఫిషియల్ ఫోటోలను కంపెనీ షేర్ చేసింది. దీనిలో మొబైల్ గ్రీన్ కలర్‌లో కనిపిస్తుంది. నివేదికల ప్రకారం ఇది గ్రే ఎడిషన్‌లో కూడా విడుదల కావచ్చు. ఇమేజ్‌ని చూస్తే ఇందులో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. దీనితో ఫ్లాష్ లైట్ కూడా సపోర్ట్ చేస్తుంది. 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రైమరీ కెమెరా, డైమెన్సిటీ 7300 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది.