iPhone 16 Price In India: ఈసారి మంటలే.. ఐఫోన్ 16 సిరీస్ ప్రైస్ లీక్.. దేశంలో ఎంతంటే..!
iPhone 16 Price In India: ఐఫోన్ 16 సరీస్ ధరలు లీక్ అయ్యాయి. ఇవి ఇండియాలో తక్కువ ధరకే లాంచ్ కానున్నాయి.
iPhone 16 Price In India:టెక్ దిగ్గజం ఆపిల్ తన కొత్త సిరీస్ ఐఫోన్ 16 సిరీస్‌ను సెప్టెంబర్ 9న లాంచ్ చేయనుంది. కొత్త ఐఫోన్ లాంచ్ డేట్ దగ్గర పడుతుండటంతో జనాల్లో దీనిపై ఉత్కంఠ పెరుగుతోంది. ఇప్పటికే ఐఫోన్ 16కి సంబంధించి అనేక లీక్స్ బయటకు వచ్చాయి. కొత్త ఐఫోన్ సిరీస్‌లో ఎటువంటి ఫీచర్లు ఉంటాయనే దానిపై చాలానే వార్తలు వచ్చాయి. రోజులు దగ్గరపడుతున్న కొద్ది ఎదొక సమాచారం లీక్ అవుతూనే ఉంది. తాజాగా ఇంటర్నెట్‌లో 16 సిరీస్ ధర కూడా అందుబాటులోకి వచ్చింది. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
ఆపిల్ ఐఫోన్ 16 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లు సెప్టెంబర్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నాయి. ఇంతలో, ఐఫోన్ 16 ధరకు సంబంధించిన కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. Apple కంపెనీ కార్యకలాపాలపై నిఘా ఉంచే వేదిక Apple Hub, Apple iPhone 16 సిరీస్‌లో చేర్చబడిన హ్యాండ్‌సెట్‌ల ధరలు ఎలా ఉంటాయో తెలియజేసింది. తాజాగా లీకైన నివేదిక ప్రకారం.. iPhone 16 ధర iPhone 15 కంటే తక్కువగా ఉంటుంది.
Apple Hub ప్రకారం.. iPhone 16 బేస్ మోడల్ ధర $799 (సుమారు రూ. 67,076) ఉంటుంది. అదే సమయంలో కంపెనీ iPhone 16 Plus కోసం $899 (సుమారు రూ. 75,471) వసూలు చేయవచ్చు. ఇది కాకుండా కంపెనీ iPhone 16 Pro స్మార్ట్‌ఫోన్ 256GB వేరియంట్‌ను $1,099 (సుమారు రూ. 92,261)కి విక్రయించవచ్చు. టాప్ మోడల్ గురించి మాట్లాడితే కంపెనీ iPhone 16 Pro Max 256GB వేరియంట్‌ను $1,199 (సుమారు రూ. 1,00,658) ధరకు సేల్‌కు తీసుకురావచ్చు.
ఐఫోన్ 16 సిరీస్‌కి సంబంధించిన నివేదికలు కొత్త ఐఫోన్‌లలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌లను కలిగి ఉంటాయని సూచిస్తున్నాయి. బేస్ మోడల్ నుండి iPhone 16 టాప్ మోడల్ వరకు ప్రతి మోడల్‌లో AI సపోర్ట్ అందుబాటులో ఉంటుంది. దీనితో పాటు, కొన్ని కొత్త ఫీచర్లను చూడవచ్చు. వీటిలో ChatGPT, , iOS18లో స్మార్ట్ స్క్రిప్ట్, నోట్స్ యాప్, క్లీన్ అప్ టూల్, Genmoji, Apple Intelligence, Siriకి అప్‌డేట్‌లు ఉన్నాయి. వీటని కంపెనీ ఇంకా ధృవీకరించలేదు.