Infinix Note 30 5G: 108MP కెమెరా, జేబీఎల్ స్టీరియో స్పీకర్లు.. రూ.15వేలలోపే 5జీ ఫోన్.. ఫీచర్లలో ది బెస్ట్..!
Smartphone Under Rs 15000: Infinix భారతదేశంలో Infinix Note 30 5Gని విడుదల చేసింది. ఈ ఫోన్‌లో పంచ్ హోల్ కటౌట్, ట్రిపుల్ కెమెరా సెటప్, JBL ఇన్-బిల్ట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. దీని ఖరీదు రూ. 15 వేల లోపే ఉంది.
Infinix Note 30 5G: Infinix భారతదేశంలో బడ్జెట్ 5G స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. ఇది శక్తివంతమైన ఫీచర్లతో వస్తుంది. గత నెలలో గ్లోబల్ మార్కెట్‌లో ప్రవేశపెట్టబడిన ఈ ఫోన్ ఇప్పుడు ఎట్టకేలకు భారతదేశంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ఫోన్‌లో పంచ్ హోల్ కటౌట్, ట్రిపుల్ కెమెరా సెటప్, JBL ఇన్-బిల్ట్ డ్యూయల్ స్టీరియో స్పీకర్లు ఉన్నాయి. దీని ఖరీదు 15 వేల లోపే ఉంది. Infinix Note 30 5G ధర, ఫీచర్లను తెలుసుకుందాం..
భారతదేశంలో Infinix Note 30 5G ధర: Infinix Note 30 5G ధర 4GB + 128GB మోడల్‌కు రూ. 14,999లు, 8GB + 256GB వేరియంట్‌కు రూ. 15,999లు గా ఉంది. యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌తో చెల్లింపుపై కంపెనీ రూ. 1,000 డిస్కౌంట్ వస్తుంది. ఫోన్ బ్లాక్, ఆరెంజ్, బ్లూ కలర్ ఆప్షన్లలో వస్తుంది. జూన్ 22న మధ్యాహ్నం 12 గంటలకు ఫ్లిప్‌కార్ట్ ఆన్‌లైన్ ద్వారా ఫోన్ సేల్ ప్రారంభమవుతుంది.
Infinix Note 30 5G స్పెసిఫికేషన్‌లు:
Infinix Note 30 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల FHD+ IPS LCD డిస్‌ప్లే, సెల్ఫీ స్నాపర్ కోసం పంచ్-హోల్ కటౌట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ MediaTek Dimensity 6080 SoC ద్వారా అందించారు. Infinix ఫోన్ 8GB LPDDR4X RAM, 256GB UFS3.1 తో వచ్చింది. 8GB అదనపు వర్చువల్ RAM సపోర్ట్ కూడా ఉంది. ఇది మీకు మెరుగైన మల్టీ టాస్కింగ్ అనుభవాన్ని అందిస్తుంది.
Infinix Note 30 5G కెమెరా & బ్యాటరీ: Infinix ఫోన్ వెనుక ట్రిపుల్ కెమెరాలు, 108MP ప్రైమరీ కెమెరా, 2MP డెప్త్ యూనిట్, AI లెన్స్ ఉన్నాయి. సెల్ఫీల కోసం, ముందు భాగంలో 16MP కెమోరా అందించారు. ఇది మీకు స్పష్టమైన, వివరణాత్మక సెల్ఫీలను క్యాప్చర్ చేయడంలో సహాయపడుతుంది. 5,000mAh బ్యాటరీ, 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టతో విడుదలైంది. దీనితో పాటు, ఇది కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 802.11ac, బ్లూటూత్ 5.1, GPS/ GLONASS, USB టైప్-C పోర్ట్‌తో వస్తుంది.