Jio 5G Service: జియో 5G సేవలని పొందాలంటే ముందుగా ఈ పని చేయాల్సిందే..!
Jio 5G Service: జియో వెల్‌కమ్ ఆఫర్‌తో పాటు 5G సేవను ప్రారంభించిన సంగతి తెలిసిందే.
Jio 5G Service: జియో వెల్‌కమ్ ఆఫర్‌తో పాటు 5G సేవను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఆఫర్ కింద వినియోగదారులు అపరిమిత 5G డేటా ప్రయోజనాన్ని పొందవచ్చు. అయితే ఇది వారి బేస్ రీఛార్జ్ ప్లాన్‌పై ఆధారపడి ఉంటుంది. జియో, ఎయిర్‌టెల్ రెండూ తమ 5G సేవలను ప్రకటించాయి. అయితే పాన్ ఇండియా స్థాయిలో 5G సేవలు ప్రస్తుతం అందుబాటులోకి రాలేదు. ఇందుకోసం వచ్చే ఏడాది వరకు ఆగాల్సిందే. జియో ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసి నగరాల్లో తన సేవలను ప్రారంభించింది. ఇక్కడ నివసిస్తున్న ప్రజలు మాత్రమే ఈ సేవను సద్వినియోగం చేసుకోగలరు.
ఈ నగరాల్లో నివసించే ప్రజలు మొదటగా జియో అనుభవాన్ని పొందుతారు. కంపెనీ తన 5G సేవను ఉపయోగించడానికి వెల్‌కమ్ ఆఫర్‌ను అందిస్తోంది. దీని కింద, వినియోగదారులు 1GBps వేగంతో అపరిమిత డేటాను పొందుతున్నారు. 5G సేవను అనుభవించడానికి ఎంపిక చేసిన వినియోగదారులకు మాత్రమే జియో ఆహ్వానాలు పంపుతోంది. అంటే అందరు కస్టమర్లు జియో సేవల ప్రయోజనాన్ని పొందలేరు. మీరు మై జియో యాప్‌లో 5G సేవ కోసం ఆహ్వానాన్ని అందుకుంటారు. దీని కోసం మీరు మై జియో యాప్‌లోకి వెళ్లి ఆహ్వానం వచ్చిందో లేదో నోటిఫికేషన్‌లో చెక్ చేయాలి.
కనీసం రూ.239 రీఛార్జ్ చేసుకున్న కస్టమర్లకు మాత్రమే జియో 5G సర్వీస్ అనుభవం అందుబాటులో ఉంటుంది. అంటే రూ.239 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసే ఫోన్ ఉన్న కస్టమర్‌లు మాత్రమే వెల్‌కమ్ ఆఫర్ ప్రయోజనాన్ని పొందుతారు. కంపెనీ ప్రకారం పోస్ట్‌పెయిడ్, ప్రీపెయిడ్ కస్టమర్‌లు రూ.239 లేదా అంతకంటే ఎక్కువ రీఛార్జ్ చేసినట్లయితే జియో 5G ప్రయోజనం పొందుతారు. టెలికాం టాక్ నివేదిక ప్రకారం మీ ఫోన్‌లో దీని కంటే తక్కువ రీఛార్జ్ ఉంటే మీరు జియో 5G ప్రయోజనాన్ని పొందలేరు.