ఈ పనిచేస్తే 24 గంటలు ఏసీ, కూలర్‌, ఫ్రిడ్జ్‌ నడిచినా కరెంట్‌ బిల్లు జీరో..!

ఈ పనిచేస్తే 24 గంటలు ఏసీ, కూలర్‌, ఫ్రిడ్జ్‌ నడిచినా కరెంట్‌ బిల్లు జీరో..!

Update: 2022-07-11 07:37 GMT

ఈ పనిచేస్తే 24 గంటలు ఏసీ, కూలర్‌, ఫ్రిడ్జ్‌ నడిచినా కరెంట్‌ బిల్లు జీరో..!

Rooftop Solar Panel: సంప్రదాయ ఇంధన వనరులకు బదులుగా ప్రత్యామ్నాయ వనరులపై ఆధారపడాలని ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు చెబుతూనే ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. సౌరశక్తిని సద్వినియోగం చేసుకోవడంపై ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఇందుకోసం సబ్సిడీ కూడా అందిస్తోంది. మీరు ఇంటి పైకప్పుపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేస్తే 30 శాతం సబ్సిడీ ఇస్తోంది. మీ ఇంటి పైకప్పుపై సౌర ఫలకాలను అమర్చడం ద్వారా విద్యుత్ బిల్లు టెన్షన్ నుంచి తప్పించుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం రూఫ్‌టాప్ సోలార్ ప్లాంట్‌లపై 30 శాతం సబ్సిడీ ఇస్తోంది. దీని వల్ల మీ లక్ష ఖర్చు దాదాపు 70 వేల రూపాయలకు తగ్గుతుంది. అంతేకాదు కొన్ని రాష్ట్రా ప్రభుత్వాలు ప్రత్యేక సబ్సిడీ ప్రకటిస్తున్నాయి. దీంతో దీని ఖర్చు మరింత తగ్గుతోంది.

ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలంటే ముందుగా మీరు సౌర ఫలకాలను జారీ చేసే రాష్ట్ర ప్రభుత్వ పునరుత్పాదక ఇంధన అథారిటీకి వెళ్లాలి. దేశంలోని ప్రధాన నగరాల్లో వారి కార్యాలయాలు ఉన్నాయి. ప్రైవేట్ డీలర్ల ద్వారా సోలార్ ప్యానెల్లు అందిస్తారు. వీటిని ఇన్‌స్టాల్ చేసుకోవడానికి, సబ్సిడీ పొందడానికి ఈ కార్యాలయాలు సహాయంచేస్తాయి. ఒకసారి ఈ సోలార్ ప్యానెళ్లను అమర్చుకుంటే 25 ఏళ్ల పాటు ఉచితంగా విద్యుత్‌ను వాడుకోవచ్చు.

సోలార్ ప్యానెల్ యొక్క జీవితకాలం దాదాపు 25 సంవత్సరాలు. ప్యానెల్లను ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు సౌర శక్తి ద్వారా విద్యుత్ పొందుతారు. దీని నిర్వహణ సులభంగా ఉంటుంది. ఈ ప్యానెల్లు 1 kW నుంచి 5 kW వరకు సామర్థ్యం కలిగి ఉంటాయి. దీన్ని ఇన్‌స్టాల్ చేసిన తర్వాత విద్యుత్ బిల్లు జీరో అవుతుంది. అలాగే గ్రీన్ ఎనర్జీని ఉపయోగించడం ద్వారా కాలుష్యాన్ని తగ్గించడంలో సహకరించవచ్చు.

Tags:    

Similar News