New Smartphone: ఇటువంటి ఫోన్ ఎన్నడూ చూడలే.. మూడు సార్లు మడత పెట్టొచ్చు..!
New Smartphone: హువావే ట్రై ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురానుంది. స్క్రీన్‌ను మూడుసార్లు మడవచ్చు.
New Smartphone: ఫోల్డబుల్ ఫోన్ మార్కెట్‌లో గట్టి పోటీ ఇచ్చేందుకు హువావే సిద్ధమైంది. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ట్రై ఫోల్డబుల్ ఫోన్‌ను తీసుకురానుంది. అంటే స్క్రీన్‌ను మూడుసార్లు మడవచ్చు. ఇటీవలే దీని మోడల్ లీక్ అయింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫోన్ ఎప్పుడు లాంచ్ అవుతుంది దాని ప్రత్యేకత ఏమిటి అనే దాని గురించి అధికారిక సమాచారం వెల్లడించలేదు. కానీ సోషల్ మీడియాలో ఓ యూజర్ దీని ధర గురించి చిన్న హింట్ ఇచ్చాడు. దీని ప్రకారం ఫోన్ డెవలప్‌మెంట్ ప్రోటోటైప్ ధర సుమారు $4,900 (సుమారు రూ. 4,11,000). ఈ ధరను తగ్గించడానికి కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించాడు.
ఈ సమాచారం X లో @jasonwill101 యూజర్ పోస్ట్ చేశాడు. Huawei హువావే ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రోటోటైప్ ధర చాలా ఎక్కువగా ఉందని సూచించారు, అయితే ప్రొడక్షన్ మోడల్ చాలా చౌకగా ఉండే అవకాశం ఉంది. మార్కెట్లోకి రానున్న ఫోన్ మోడల్ ధర CNY 29000 అంటే దాదాపు $4,000 (సుమారు రూ. 3,35,000) ఉంటుందని అంచనా వేస్తున్నారు. హువావే ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ అత్యంత ఖరీదైన మాస్ మార్కెట్ ఫోన్ అవుతుంది.
దీని ధర Samsung Galaxy Z Fold 6 వంటి ఇతర ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్‌ల ధర కంటే రెండింతలు ఎక్కువగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ కిరిన్ 9 సిరీస్ చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. కిరిన్ 9010 ప్రాసెసర్ రాబోయే Huawei Mate 70 సిరీస్‌లోనూ ఉంటుంది. చెప్పాలంటే ఇది Snapdragon 8 Gen 3 లేదా MediaTek డైమెన్సిటీ 9300 వంటి మార్కెట్‌లోని ఇతర ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్‌ల వలె పర్ఫార్మ్ చేయదు. హువావే ట్రై ఫోల్డ్‌బుల్ ఫీచర్ల విషయానికి వస్తే స్మార్ట్‌ఫోన్ 10-అంగుళాల లోపలి డిస్‌ప్లేను కలిగి ఉంటుంది.
దీన్ని డ్యూయల్-హింజ్ సిస్టమ్‌కు మూడుసార్లు మడవచ్చు. ఇందులో మూడు వేర్వేరు స్క్రీన్ పార్ట్స్ ఉంటాయి. ఈ స్క్రీన్‌లలో ఒకటి లోపలికి మడవవచ్చు, మరొకటి బయటకు ఫోల్డ్ చేయవచ్చు. స్మార్ట్‌ఫోన్ ఇటీవలే Huawei కన్స్యూమర్ బిజినెస్ గ్రూప్ CEO రిచర్డ్ యు చేతిలో కనిపించింది. దీనికి ముందు కెమెరా కోసం ఎడమవైపు స్క్రీన్‌పై రంధ్రం-పంచ్ కటౌట్‌ను కలిగి ఉన్నట్లు కనిపిస్తోంది. ట్రై-ఫోల్డ్ స్మార్ట్‌ఫోన్ అయినప్పటికీ ఫోన్ వెయిట్ తక్కువగా ఉండే అవకాశం ఉంది.