Honor Magic 6 Pro: హానర్ నుంచి స్టన్నింగ్ స్మార్ట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే
Honor Magic 6 Pro: హానర్ నుంచి స్టన్నింగ్ స్మార్ట ఫోన్ వచ్చేస్తోంది.. ఫీచర్స్ తెలిస్తే ఫిదా అవ్వాల్సిందే
Honor Magic 6 Pro: భారత మార్కెట్లోకి రోజుకో కొత్త స్మార్ట్ ఫోన్ సందడి చేస్తోంది. ముఖ్యంగా చైనాకు చెందిన కంపెనీలు కొంగొత్త ఫోన్‌లతో ఇండియన్ యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ భారత మార్కెట్లోకి కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. హానర్ మ్యాజిక్ 6 ప్రో పేరుతో ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు ఇంతకీ ఈ ఫోన్‌లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయి.? ధర ఎంత.? లాంటి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
స్మార్ట్ ఫోన్ దిగ్గజం హానర్ భారత మార్కెట్లోకి హానర్ మ్యాజిక్ 6 ప్రో పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ఆగస్టు రెండో తేదీన ఈ ఫోన్‌ను తీసుకొస్తున్నారు. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమజాన్‌లో ఈ ఫోన్ అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్ ఫోన్‌ను బ్లాక్, గ్రీన్ కలర్ ఆప్షన్లలో తీసుకొస్తున్నారు. ఫీచర్ల విషయానికొస్తే హానర్ మ్యాజిక్ 6ప్రో స్మార్ట్ ఫోన్‌లో 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేటుతోపాటు 6.8 అంగుళాల ఫుల్ హెచ్డీ+ (1280×2880 పిక్సెల్స్) ఎల్టీపీఓ ఓలెడ్ స్క్రీన్‌ను అందిస్తున్నారు.
డాల్బీ విజన్ ఈ స్క్రీన్ ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక ఈ స్క్రీన్ 5000 నిట్స్ పీక్‌బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో ఈ ఫోన్ స్క్రీన్‌ను సన్‌లైట్‌లోనూ స్పష్టంగా చూడొచ్చు. హానర్ మ్యాజిక్ 6ప్రో స్మార్ట్ ఫోన్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 ఎస్వోసీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌ను 12 జీబీ ర్యామ్ లేదా 16 జీబీ ర్యామ్, 256 / 512 / 1 టిగా బైట్ స్టోరేజీ కెపాసిటీ వేరియంట్స్‌లో తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత మ్యాజిక్ ఓఎస్ 8.0 వర్షన్‌పై పని చేస్తుంది. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో ట్రిపుల్ రెయిర్ కెమెరా సెటప్‌ను అందించనున్నారు. వీటిలో 180 మెగాపిక్సెల్, 50 ఎంపీతో కూడిన రెండు కెమెరాలను అందించనున్నారు. 2.5ఎక్స్ ఆప్టికల్ జూమ్ అండ్ అప్ టూ 10ఎక్స్ డిజిటల్ జూమ్ సపోర్ట్ చేయడం ఈ ఫోన్ కెమెరా ప్రత్యేకతగా చెప్పొచ్చు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 50 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇవ్వనున్నారు. అలాగే బ్యాటరీ విషయానికొస్తే ఈ ఫోన్‌లో 80 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జిగ్‌కు సపోర్ట్ చేసే 5600 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనున్నారు.