HMD Phones First Sale: బాస్ ఈజ్ బ్యాక్.. హెచ్‌ఎమ్‌డీ నుంచి రెండు ఫోన్లు.. రూ. 12,999కే దక్కించుకోవచ్చు!

HMD Phones First Sale: హెచ్‌ఎమ్‌డీ క్రెస్ట్, క్రెస్ట్ మాక్స్ మొదటి సేల్‌కు రానున్నాయి. అమెజాన్ వీటిపై రూ.500 కూపన్ డిస్కౌంట్ అందిస్తుంది.

Update: 2024-08-06 12:49 GMT

HMD Phones First Sale

HMD Phones First Sale: హెచ్‌ఎమ్‌‌డీ నోకియా బ్రాండింగ్ లేకుండా తన మొదటి స్మార్ట్‌ఫోన్‌ను కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. అందులో హెచ్‌ఎమ్‌డీ క్రెస్ట్, క్రెస్ట్ మాక్స్ ఉన్నాయి. ఈ రెండు సెల్ఫ్ రిపేరబుల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లు. అయితే కంపెనీ మొదటిసారిగా ఈ ఫోన్‌ను సేల్‌కు తీసుకొస్తుంది. అలానే మొదటి సేల్ సందర్భంగా ఫోన్‌పై ఆఫర్లు, డిస్కౌంట్లు ప్రకటించింది. రెండు మోడల్స్ 5G Unisoc చిప్‌సెట్, లేటెస్ట్ Android ఆపరేటింగ్ సిస్టమ్‌తో వస్తాయి.

హెచ్ఎమ్‌డీ క్రెస్ట్, క్రెస్ట్ మాక్స్ ధర, సేల్ విషయానికి వస్తే హెచ్‌ఎమ్‌డీ క్రెస్ట్ మిడ్‌నైట్ బ్లూ, రాయల్ పింక్, లష్ లిలక్ వంటి మల్టిపుల్ కలర్ వేరియంట్‌లలో వచ్చే అవకాశం ఉంది. క్రెస్ట్ మాక్స్ డీప్ పర్పుల్, ఆక్వా గ్రీన్, రాయల్ పింక్ కలర్స్‌లో వస్తుంది. రెండు మోడళ్లు ఒకే స్టోరేజ్ కాన్ఫిగరేషన్‌లో వస్తాయి. క్రెస్ట్ 6GB+128GB కాన్ఫిగరేషన్ ధర రూ. 14,499. క్రెస్ట్ మ్యాక్స్ 8GB +256GB ఇంటర్నల్ స్టోరేజ్ ధర రూ. 16,499.

హెచ్ఎమ్‌డీ మొదటి సేల్‌‌లో CREST500 ప్రోమో కోడ్‌ లభిస్తుంది. దీని ద్వారా క్రెస్ట్ సిరీస్‌పై 500 రూపాయల డిస్కౌంట్‌ను అమెజాన్ అందిస్తోంది. అయితే SBI క్రెడిట్ కార్డ్ వినియోగదారులు ఫోన్‌ను రూ. 1,000 డిస్కౌంట్‌తో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ల తర్వాత క్రెస్ట్ ధర కేవలం రూ. 12,999కి చేరుతుంది. క్రెస్ట్ మ్యాక్స్ ధర రూ. 14,999గా ఉంటుంది. ఇది ఆగస్టు 11, 2024 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

హెచ్‌ఎమ్‌డీ క్రెస్ట్ స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే క్రెస్ట్ సిరీస్ 6.67-అంగుళాల OLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్, FHD+ రిజల్యూషన్‌‌కు సపోర్ట్ చేస్తుంది. మరోవైపు, బేస్ క్రెస్ట్‌లో 50 మెగాపిక్సెల్ డ్యూయల్ కెమెరా సెటప్, క్రెస్ట్ మాక్స్‌లో 64-మెగాపిక్సెల్ ట్రిపుల్ కెమెరా మాడ్యూల్‌ ఉంటుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ల కోసం, రెండు మోడళ్లు 50 మెగాపిక్సెల్ షూటర్‌ను కలిగి ఉంటాయి. అలానే UNISOC T760 ప్రాసెసర్‌తో రన్ అవుతాయి. పవర్ కోసం భారీ 5,000mAh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది 33W వైర్డు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది.

Tags:    

Similar News