Google: టాయిలెట్స్‌ ఎక్కడున్నాయో తెలియక ఇబ్బంది పడుతున్నారా.?

ఇటీవల హార్పిక్‌ ఇండియా దిల్లీలో నిర్వహించిన సర్వేలో 70% మహిళలకు వాడుకోవటానికి వీలైన పబ్లిక్‌ టాయ్‌లెట్‌ ఎక్కడుందో తెలియదంటా

Update: 2024-06-10 15:30 GMT

Google: టాయిలెట్స్‌ ఎక్కడున్నాయో తెలియక ఇబ్బంది పడుతున్నారా.?

Google: బయటకు ఎక్కడికైనా వెళ్లినప్పుడు చాలా మంది ఎదుర్కొనే సమస్యల్ల టాయిలెట్ ఒకటి. మరీ ముఖ్యంగా మహిళలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొంటుంటారు. తెలిసిన ప్రదేశానికి వెళితే అప్పటికే టాయిలెట్స్‌ ఎక్కడ ఉన్నాయో ఓ క్లారిటీ ఉంటుంది. అలా కాకుండా తెలియని ప్రదేశాలకు వెళ్తే ఇబ్బందులు తప్పవు. గ్రామీణ ప్రాంతాలతో పోల్చితే పట్టణాల్లో ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంటుంది.

పట్టణాల్లో పురుషులు కూడా ఇబ్బందులు పడక తప్పదు. దీంతో కొందరు మహిళలకు బయటకు వెళ్లాల్సిన సమయాల్లో సరిగ్గా నీళ్లు కూడా తాగరు. దీంతో ఇది ఆరోగ్యంపై ప్రభావం కూడా పడుతుంది. పోనీ మూత్రాన్ని ఆపుకుంటే అది కూడా ప్రతికూల ప్రభావం చూపుతుంది. మరి ఈ సమస్యకు పరిష్కారమే లేదా అంటే కచ్చితంగా ఉంది. ఈ సమస్యకు పరిష్కారం చూపుతు హార్పిక్‌ ఓ యాప్‌ను‌ అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇటీవల హార్పిక్‌ ఇండియా దిల్లీలో నిర్వహించిన సర్వేలో 70% మహిళలకు వాడుకోవటానికి వీలైన పబ్లిక్‌ టాయ్‌లెట్‌ ఎక్కడుందో తెలియదంటా. ఇలాంటి ఇబ్బందులకు చెక్‌ పెట్టే ఉద్దేశంతోనే హార్పిక్‌ సంస్థ పబ్లిక్‌ టాయ్‌లెట్లను గుర్తించే యాప్‌ను రూపొందించింది. దీని పేరు హార్పిక్‌ లొకేటర్‌. ఇది సమీపంలోని పబ్లిక్‌ టాయ్‌లెట్లను తేలికగా గుర్తించడంలో సహాయపడుతుంది. టాయ్‌లెట్స్‌లోని సదుపాయాలను బట్టి రేటింగ్ ఇచ్చే ఫీచర్‌ కూడా అందించారు. ఈ రేటింగ్‌ ఆధారంగా ఏది మంచిదో తెలుసుకోవటానికీ వీలుంటుంది. ఈ యాప్‌ అందరికీ ఉపయోగ పడేదే అయినా మహిళలకు మరింత ఎక్కువ ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. 

Tags:    

Similar News