Google Maps: ఇది కదా అసలైన అప్‌డేట్‌ అంటే.. గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్స్‌..!

Google Maps: గూగుల్ మ్యాప్స్‌కు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

Update: 2024-07-26 08:33 GMT

Google Maps: ఇది కదా అసలైన అప్‌డేట్‌ అంటే.. గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఫీచర్స్‌..!

Google Maps: గూగుల్ మ్యాప్స్‌కు ఉన్న ఆదరణ ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రపంచవ్యాప్తంగా మ్యాప్స్‌ను కోట్లాది మంది యూజర్లు వినియోగిస్తున్నారు. యూజర్ల అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు కొంగొత్త ఫీచర్లను తీసుకొస్తున్న గూగుల్‌ తాజాగా మ్యాప్స్‌లో కొత్త ఫీచర్స్‌ను తీసుకొస్తోంది. ఇంతకీ ఏంటా ఫీచర్స్‌ వాటి ఉపయోగాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కారులో ప్రయాణిస్తున్న సమయంలో మ్యాప్స్‌లో అడ్రస్‌ సెట్ చేసుకొని వెళ్తుంటాం. అయితే అదే సమయంలో రోడ్డుపై సెడన్‌గా ఒక ఫ్లై ఓవర్‌ ఉంటుంది. ఫ్లైఓవర్‌ పై నుంచి వెళ్లాలా.? కింది నుంచి వెళ్లాలా.? అనే అనుమానం వస్తుంది. ఈ సమస్యకు చెక్‌ పెట్టేందుకే గూగుల్ మ్యాప్స్‌లో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. 'ఫ్లైఓవర్‌ కాల్‌ ఔట్‌' పేరుతో ఈ కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫీచర్‌ సహాయంతో మీకు ఫ్లై ఓవర్‌కి దగ్గరల్లో ఉండగానే ఆ విషయాన్ని మ్యాప్స్‌ చెబుతుంది. ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ ఫీచర్‌ ఈ వారంలో రానుంది. అయితే ఐఓఎస్‌ యూజర్లకు మాత్రం ఆలస్యంగా తీసుకురానున్నారు.

ఇదిలా ఉంటే గూగుల్ మ్యాప్స్‌లో తీసుకొస్తున్న మరో కొత్త ఫీచర్‌ విషయానికొస్తే.. కారులో ప్రయణిస్తుంటాం. అయితే మ్యాప్స్‌లో చూపించినట్లు సాఫీగా వెళ్లిపోతుంటాం. అయితే ఆ మార్గం ఒకవేళ సన్నగా ఉంటే. కారు అందులో పట్టే అవకాశం లేకపోతే పరిస్థితి ఏంటి.? వెనకా ముందు చూసుకోకుండా వెళ్లిపోయి ఇరుక్కుపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి సమస్యకు చెక్‌ పెట్టేందుకు కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఈ ఫీచర్‌ సహయంతో రోడ్డు ఇరుకుగా ఉంటే ముందుగానే అలర్ట్‌ చేస్తుంది. తొలుత ఈ ఫీరచ్‌ను 8 నగరాల్లో తీసుకురానున్నారు. ఇందుకోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.

ఇదిలా ఉంటే గూగుల్ ఇది వరకే ఒక సరికొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు ప్రకటన చేసింది. దేశంలో విద్యుత్‌ వాహనాల వినియోగం పెరుగుతోన్న నేపథ్యంలో ఛార్జింగ్ స్టేషన్ల వివరాలను గూగుల్‌లో తెలుసుకునేందుకు వీలుగా ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. దీంతో మీకు సమీపంలో ఉన్న ఈవీ ఛార్జింగ్‌ స్టేషన్ల వివరాలను, పోర్టు టైప్‌ వంటి వివరాలను మ్యాప్స్‌లో చూపించనున్నారు.

Tags:    

Similar News