Google Pixel 7a: గూగుల్ పిక్సెల్ ఫుల్లీ అప్ గ్రేడెడ్ వెర్షన్.. రూ.4వేలు తగ్గింపుతో భారత్ మార్కెట్ లోకి.. ధర ఎంతంటే..?

Google Pixel 7A: గూగుల్ పిక్సెల్ 7A స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. పిక్సెల్ 6A తో పోల్చితే చాలా అప్ గ్రేడ్ లతో గూగుల్ పిక్సెల్ 7A వచ్చింది.

Update: 2023-05-11 08:00 GMT

Google Pixel 7A: గూగుల్ పిక్సెల్ 7A స్మార్ట్ ఫోన్ ఇండియాలో లాంఛ్ అయింది. పిక్సెల్ 6A తో పోల్చితే చాలా అప్ గ్రేడ్ లతో గూగుల్ పిక్సెల్ 7A వచ్చింది. 6.1 ఇంచెస్ ఫుల్ హెచ్ డీ+ OLED డిస్ ప్లే తో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్, హెచ్ డీఆర్ సపోర్ట్ తో పాటు ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ఉంది. ఇక ప్రాసెసర్ విషయంలో గత మోడల్ కు భిన్నంగా పిక్సెల్ 7Aలో లేటెస్ట్ టెన్సార్ జీ2 ప్రాసెసర్ ఉంది. అలాగే ఈ ఫోన్ లో టైటాన్ ఎం2 సెక్యూరిటీ కో ప్రాసెసర్ కూడా ఉంది. 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ కలిగిన ఈ మొబైల్ 5జీ నెట్ వర్క్ ను సపోర్ట్ చేస్తుంది. ఇందులో ఆండ్రాయిడ్ 13OS ఉంది.

కెమెరా విషయంలో సైతం గత మోడల్ తో పోల్చితే 7A భారీగా అప్ గ్రేడ్ అయింది. ఫోన్ వెనుక రెండు కెమెరాలు ఉన్నాయి. OIS సపోర్ట్ తో 64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా, 13 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 13 మెగా పిక్సెల్ ఫ్రంట్ కెమెరాను గూగూల్ పొందుపరిచింది.

ఇక బ్యాటరీ విషయానికొస్తే, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 4,385 mAh బ్యాటరీ కలిగి ఉంది. 18 వాట్స్ వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ కు 7A సపోర్ట్ చేస్తుంది అయితే అడాప్టర్ ఇవ్వలేదు. మరోవైపు వైర్ లెస్ ఛార్జింగ్ ఫీచర్ ను తొలిసారి గూగూల్ ఈ ఫోన్ ద్వారా అందుబాటులోకి తెచ్చింది. ఇక 193 గ్రాముల బరువుతో వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ కలిగిఉంది.

గూగుల్ పిక్సెల్ 7A ను ఒకే వేరియంట్ లో అందుబాటులో ఉంది. ఇక ఈ ఫోన్ ధర రూ. 43,999గా ఉంది. లాంఛ్ ఆఫర్ లో భాగంగా హెచ్ డీఎఫ్ సీ క్రెడిట్, డెబిట్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.4000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ మొబైల్ తో పాటు కొంటే పిక్సెల్ బడ్స్ A సిరీస్ ను రూ.3,999కే పొందవచ్చు. ఫిట్ బిట్ ఇన్స్ పైర్ ను కూడా రూ.3,999 సొంతం చేసుకోవచ్చు.

Tags:    

Similar News