Maps: మీ వెహికిల్ ఎక్కడ పార్క్ చేశారో, కన్ఫ్యూజ్ అవుతున్నారా.? మ్యాప్స్‌లో కొత్త ఫీచర్..
Maps: మీ వెహికిల్ ఎక్కడ పార్క్ చేశారో, కన్ఫ్యూజ్ అవుతున్నారా.? మ్యాప్స్‌లో కొత్త ఫీచర్..
Maps: ఏదైనా మాల్‌కి వెళ్తారు అక్కడ పార్కింగ్ ప్లేస్‌లో వందల సంఖ్యలో వాహనాలు ఉంటాయి. అందులో మన వెహికిల్ ఎక్కడో ఒక చోట పార్క్ చేస్తాం. తీరా షాపింగ్ ముగించుకొని రాగానే వెహికిల్ ఎక్కడ పార్క్ చేశామో మర్చిపోతుంటాం. అలాగే ఏదైనా గుడికి వెళ్తాం అక్కడా ఇదే పరిస్థితి నెలకొంటుంది. పార్క్ చేసిన కారును కనిపెట్టడం పెద్ద టాస్క్‌లాగా మారుతుంది. దీంతో మన వెహికిల్‌ను వెతుక్కోవడానికి సమయం వృధా అయ్యే అవకాశాలు ఉంటాయి.
మీరు కూడా ఏదో ఒక సమయంలో ఇలాంటి సమస్యే ఎదుర్కొని ఉంటారు కదూ! అయితే మీకోసమే గూగుల్ మ్యాప్స్‌లో అదిరిపోయే ఓ ఫీచర్‌ను తీసుకొచ్చారు. సేవ్ యూవర్ పార్కింగ్ లొకేషన్ అనే పేరుతో తీసుకొచ్చిన ఈ కొత్త ఫీచర్ మీ పార్కింగ్ సమస్యలకు పరిష్కారం చూపుతుంది. మనం పార్క్ చేసిన వాహనం ఎక్కడుందో ఈ ఫీచర్‌తో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇంతకీ ఈ ఫీచర్‌ను ఎలా ఉపయోగించుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..
ముందుగా మీరు వెహికిల్ పార్క్ చేసిన ప్రదేశాన్ని యాప్‌లో చేసుకోవాలి. ఇందుకోసం మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి. ఆ తర్వాత మీరు ఉన్న ప్రదేశాన్ని యాక్సెస్ ఇవ్వాలి. అప్పుడు మీరు ఉన్న ప్రదేశంల గూగుల్ మ్యాప్స్ లో బ్లూ కలర్ డాట్ హైలెట్ చేస్తూ చూపిస్తుంది. వెంటనే ఆ బ్లూ డాట్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత కనిపించే సేవ్ పార్కింగ్ లొకేషన్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. దీంతో యాప్‌లో మీ లొకేషన్ సేవ్ అవుతుంది.
ఇక మీరు సేవ్ చేసిన లొకేషన్‌ను తెలుసుకోవాడానికి మ్యాప్స్ యాప్‌ను ఓపెన్ చేయాలి. వెంటనే మీ ప్రసెంట్ లొకేషన్‌ను సూచించే బ్లూ డాట్ పై క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇందాక సెలక్ట్ చేసుకున్నట్లే షేర్ లొకేషన్ చిహ్నం పక్కన ఉన్న "సేవ్ పార్కింగ్" పై క్లిక్ చేయండి. తర్వాత మ్యాప్స్‌ను జూమ్ అవుట్ చేసిన మీరు వాహనాన్ని ఎక్కడ పార్క్ చేశారో చూసుకోండి. పార్కింగ్ ప్రదేశాన్ని గుర్తించిన తర్వాత దానిపై క్లిక్ చేస్తే సరిపోతుంది. ఆ ప్రదేశానికి మిమ్మల్ని నావిగేట్ చేస్తుంది. ఇది కేవలం పార్కింగ్ కోసం మాత్రమే కాకుండా.. మీరు తిరిగి వెళ్లాల్సిన ప్రదేశానికి సంబంధించిన రూట్ మార్చిపోయినా ఉపయోగపడుతుంది.