టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం!
Google Apps Banned: యాప్స్ డెవలపర్లకు భారీ షాకిస్తూ 12లక్షల యాప్స్ బ్లాక్
Google Apps Banned: ప్రముఖ టెక్ దిగ్గజం గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. యాప్స్ డెవలపర్లకు భారీ షాకిస్తూ 12లక్షల యాప్స్‌ను బ్లాక్ చేసింది. 2021లో గూగుల్ ప్లేస్టోర్ ప్రైవసీ పాలసీ నిబంధనల్ని ఉల్లంఘించినందుకు 12లక్షల యాప్స్‌పై చర్యలు తీసుకున్నట్లు గూగుల్ ప్రకటించింది. ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌తో జనాల్ని పీక్కుతింటున్న యాప్‌లు గూగుల్ ప్లేస్టోర్‌లో చాలానే ఉన్నాయని గూగుల్ గుర్తించింది. అలాంటి మోసపూరిత, సేఫ్ కానీ యాప్‌లపై చెక్ పేట్టే ప్రయత్నం చేసింది. 12లక్షల యాప్స్‌ను నిషేధించింది. దీంతో పాటు స్పామ్ డెవలపర్స్‌గా అనుమానిస్తున్న 2లక్షల యాప్స్‌ను, ఇన్ యాక్టీవ్‌గా ఉన్న మరో 5లక్షల యాప్స్‌ను నిలిపివేసింది.