Banned Apps in Play Store: ఫోటో బ్యూటీ యాప్స్ తో అకౌంట్ లూటీ అయ్యే ఛాన్స్
* మూడు యాప్స్ ని బ్యాన్ చేసిన గూగుల్ ప్లేస్టోర్
Banned Apps in Play Store: వినియోగదారుల గోప్యతను కాపాడటానికి.., నిబంధనలకు విరుద్ధంగా ఉన్న 150 యాప్స్ ని గూగుల్ ప్లేస్టోర్ నుండి తొలగించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో మూడు యాప్స్ ని కూడా నిషేధించింది. వినియోగదారుల నుండి డబ్బును మోసపూరితంగా తస్కరించడంతో వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలిస్తున్న యాప్స్ ని ప్రముఖ సెక్యూరిటీ సంస్థ గుర్తించింది. ఫేస్ బుక్ లాగిన్ మెకనిజాన్ని ఉపయోగించి కొన్ని యాప్స్ వినియోగదారులను మోసం చేస్తునట్లు తెలిపింది.
మేజిక్ ఫోటో ల్యాబ్ - ఫోటో ఎడిటర్,
బ్లెండర్ ఫోటో ఎడిటర్ - ఈజీ ఫోటో బ్యాక్ గ్రౌండ్ ఎడిటర్,
పిక్స్ ఫోటో మోషన్ ఎడిట్ 2021 లను ప్లేస్టోర్ నుండి తొలగించింది.
అయితే ఇప్పటికే ఈ యాప్స్ డౌన్లోడ్ చేసుకున్న వినియోగదారులు వెంటనే ఆ యాప్స్ ని డిలీట్ చేసి ఫేస్ బుక్ పాస్ వర్డ్ లను మార్చుకోవాలని సూచించింది. వినియోగదారులు ఏదైనా యాప్స్ ని డౌన్లోడ్ చేసుకున్న సమయంలో ఒకటికి రెండు సార్లు ప్రైవసీ చెక్ చేసుకొని యాప్స్ కి పర్మిషన్ ఇవ్వాల్సిందిగా ప్రముఖ సెక్యూరిటీ సంస్థ పేర్కొంది. ఇలా చేస్తే తప్ప మోసపూరిత యాప్స్ నుండి మీ వ్యక్తిగత సమాచారాన్ని కాపాడుకోలేరు.