iPhone 16: ఐఫోన్ 16పై ఏకంగా రూ. 25 వేల డిస్కౌంట్.. ఎలా పొందాలంటే..?
ఐఫోన్ 16 సిరీస్‌లో భాగంగా మొత్తం నాలుగు ఫోన్‌లను లాంచ్ చేశాయి. వీటిలో ఐఫోన్ 16 ధర రూ. 79,900, ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900, ఐఫోన్ 16 ప్రో ధర రూ. 1,19,900, ఐఫోన్ ప్రో మ్యాక్స్ ధర రూ. 1,44,900గా నిర్ణయించారు.
iPhone 16: ఐఫోన్ 16 సిరీస్ ఫోన్‌లు భారత మార్కెట్లో సందడి చేస్తున్నాయి. దీంతో ఈ ఫోన్‌ను వీలైనంత త్వరగా సొంతం చేసుకోవాలని ప్రజలు ఆసక్తి చూపిస్తున్నారు. దేశంలోని పలు యాపిల్ స్టోర్స్ వద్ద బారులు తీరిన క్యూ లైన్స్ దీనికి సాక్ష్యంగా చెప్పొచ్చు. సెప్టెంబర్ 20వ తేదీ నుంచి ఆఫ్‌లైన్ స్టోర్‌లతో పాటు ఆన్‌లైన్‌లోనూ ఈ ఫోన్ అందుబాటులోకి వచ్చింది. ఈ క్రమంలోనే ప్రము క్విక్ కామర్స్ సంస్థలైన బిగ్ బాస్కెట్, బ్లింకిట్ కేవలం పది నిమిషాల్లోనే ఐఫోన్ 16ని నేరుగా ఇంటికి చేర్చే సేవలను ప్రారంభించాయి.
ఐఫోన్ 16 సిరీస్‌లో భాగంగా మొత్తం నాలుగు ఫోన్‌లను లాంచ్ చేశాయి. వీటిలో ఐఫోన్ 16 ధర రూ. 79,900, ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900, ఐఫోన్ 16 ప్రో ధర రూ. 1,19,900, ఐఫోన్ ప్రో మ్యాక్స్ ధర రూ. 1,44,900గా నిర్ణయించారు. అధునాతన ఫీచర్లతో తీసుకొచ్చిన ఐఫోన్ 16ని ధర ఎక్కువైనా ప్రజలు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. అయితే ఈ ఫోన్‌ను తక్కువ ధరకు సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. గరిష్టంగా రూ. 25 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇంతకీ ఈ డిస్కౌంట్ ఎలా పొందొచ్చో ఇప్పుడు తెలుసుకుందాం.
ఐఫోన్ 16 ఫోన్‌ను అమెరికన్ ఎక్స్‌ప్రెస్, యాక్సిస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌లకు చెందిన కార్డులతో కొనుగోలు చేస్తే రూ. 5000 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే పలు బ్యాంకులతో 3 నుంచి 6 నెలల పాటు నో కాస్ట్ ఈఎమ్‌ఐ ఆప్షన్‌ను అందించారు. ఇక మీ పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా భారీగా డిస్కౌంట్ పొందొచచు. మీ పాత ఐఫోన్13ని ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 25,000 వరకు డిస్కౌంట్‌ను పొందొచ్చు. ఇక ఇతర ఫోన్‌లను ఎక్స్ఛేంజ్ చేసుకోవడం ద్వారా రూ. 4 వేల నుంచి రూ. 60 వేల వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
ఇక ఐ ఫోన్ 16 ఫీచర్ల విషయానికొస్తే ఇందులో 6.1 ఇంచెస్‌తో కూడిన స్క్రీన్‌ను అందించారు. ఐఫోన్ 16 ప్లస్‌లో 6.7 ఇంచెస్ స్క్రీన్‌ను ఇచ్చారు. ఐఫోన్ 16 ప్రోలో 6.3 ఇంచస్ స్క్రీన్‌ను అందించారు. ఐఫోన్ 16 ప్రో మాక్స్ ఫోన్‌లో 6.9 ఇంచెస్ స్క్రీన్‌ను అందించారు. యాపిల్ ఫోన్‌లో ఇంత పెద్ద స్క్రీన్ ఇదే కావడం విశేషం. ఐఫోన్‌లో 16, 16 ప్లస్‌లో ఏ18 చిప్ ప్రాసెసర్‌ను అందించారు. కెమెరా విషయానికొస్తే ఐఫోన్16లో 48 మెగాపిక్సెల్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను అందించారు. యాపిల్ ఇంటెలిజెన్స్(ఏఐ), కొత్త చిప్ ఏ18తో వచ్చిన ఈ మొబైల్స్‌లో అధునాతన కెమెరా కంట్రోల్ బటన్, యాక్షన్ బటన్ అనే రెండు కొత్త బటన్లను అందించారు.