Free Netflix: పండగ చేస్కోండి.. ఉచితంగా నెట్‌ఫ్లిక్స్..!
Free Netflix: టెలికాం కెంపెనీలు విఐ, ఎయిర్‌టెల్, జియో ఉచితంగా నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి.
Free Netfilx: ప్రస్తుత 5జీ యుగంలో జనాలెవరికి క్యూ లైన్‌లో నుంచుని టికెట్ల కోసం తన్నుకొని సినిమా చూసే ఓపికలేదు. అన్ని పనులు కూడా చిటికెలో స్మార్ట్‌ఫోన్‌తో అయిపోవాలి. ఈ క్రమంలోనే ఓటీటీల వినియోగం పీక్ స్టేజ్‌కి చేరింది. వీటిలో అనేక ఫ్లాట్‌ఫామ్‌లు ఉన్నాయి. వీటిన్నింటిలో గ్లోబల్ మార్కెట్‌లో ఫేమస్ అయినది నెట్‌ఫ్లిక్స్. దీని యూజర్ బేస్ 100 కోట్లకు పైగానే ఉంది. నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ ప్రైస్ కూడా చాలా ఎక్కువగానే ఉంటుంది. అయితే ఇప్పుడు దీన్ని ఫ్రీగా పొందొచ్చు. కొన్ని టెలికాం కంపెనీలు ఉచితంగా ఈ ఓటీటీని అందిస్తున్నాయి.
ఫ్రీ నెట్‌ఫ్లిక్స్ విషయానికి వస్తే మీరు ఎంచుకున్న రీఛార్జ్ ప్లాన్‌లతో Netflixకి కాంప్లిమెంటరీ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా పొందవచ్చు. రిలయన్స్ జియో, భారతీ ఎయిర్‌టెల్, వోడాఫోన్ ఐడియా (Vi) అన్నీ ఎంపిక చేసిన రీఛార్జ్ ప్లాన్‌లలో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తున్నాయి. దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
(జియో ఫ్రీ నెట్‌ప్లిక్స్) Jio Free Netfilx
రిలయన్స్ జియో మాత్రమే దాని రెండు ప్లాన్‌లతో ఉచిత నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్‌ను అందిస్తోంది. ఈ రెండు రీఛార్జ్ ప్లాన్‌లు 84 రోజుల వాలిడిటీతో వస్తాయి. ప్లాన్‌లో డైలీ డేటాతో పాటు, అన్‌లిమిటెడ్ కాలింగ్, డైలీ 100 ఎస్ఎమ్ఎస్‌లు పంపే అవకాశం ఉంది. రూ. 1,299 రీఛార్జ్ ప్లాన్ 2జీబీ డైలీ డేటాతో నెట్‌ఫ్లిక్స్ మొబైల్ సబ్‌స్క్రిప్షన్ అందిస్తుంది. రూ. 1,799 వాల్యూ రెండవ రీఛార్జ్ ప్లాన్ 3జీబీ డైలీ డేటాతో Netflix బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ఆఫర్ చేస్తోంది.
(ఎయిర్‌టెల్ ఫ్రీ నెట్‌ఫ్లిక్స్) Airtel Free Netflix
ఎయిర్‌టెల్ వినియోగదారులు రూ. 1,798 ప్రీపెయిడ్ ప్లాన్‌తో రీఛార్జ్ చేస్తే నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా పొందుతారు. ఈ ప్లాన్ 84 రోజుల వాలిడిటీదో వస్తుంది. 3 జీబీ డైలీ డేటాను అందిస్తోంది. అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు, డైలీ 100 ఎస్ఎమ్ఎస్‌లను ఎంజాయ్ చేయవచ్చు. ఈ ప్లాన్‌లో ఎయిర్టెల్ థాంక్స్ యాప్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.
(విఐ ఫ్రీ నెట్‌ఫ్లిక్స్) Vi Free Netflix
వోడాఫోన్ ఐడియా వినియోగదారులు రూ. 1599 ప్లాన్‌తో రీఛార్జ్ చేయడంపై నెట్‌ఫ్లిక్స్ బేసిక్ సబ్‌స్క్రిప్షన్‌ను ఉచితంగా దక్కించుకోవచ్చు. ఈ ప్లాన్ 2.5GB డైలీ డేటాను అందిస్తుంది. అన్ని నెట్‌వర్క్‌లలో అన్‌లిమిటెడ్ కాలింగ్‌తో పాటు, డైలీ 100 ఎస్ఎమ్ఎస్‌లు లభిస్తాయి. ఈ ప్లాన్‌లో Vi Hero బెనిఫిట్స్ కూడా ఉన్నాయి.