Smartphone: మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం హెల్తీగా ఉండాలా.? ఈ టిప్స్ పాటించండి..!
Smartphone: మీ ఫోన్ బ్యాటరీ ఎక్కువ కాలం హెల్తీగా ఉండాలా.? ఈ టిప్స్ పాటించండి..
Smartphone: ప్రస్తుతం స్మార్ట్ ఫోన్‌ను ఉపయోగించని వారు లేరని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రతీ ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్ కచ్చితంగా ఉండే పరిస్థితి వచ్చేసింది. అయితే స్మార్ట్ ఫోన్ ఉపయోగించే వారిలో చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో ఛార్జింగ్ ప్రధానమైంది. స్మార్ట్‌ఫోన్‌లో మనం చేసే కొన్ని పొరపాట్ల కారణంగా బ్యాటరీ ఆరోగ్యం త్వరగా దెబ్బతింటుంది. దీంతో బ్యాటరీ ఉబ్బడం, ఛార్జింగ్ త్వరగా దిగిపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అయితే కొన్ని సింపుల్ చిట్కాలు పాటించడం ద్వారా మీ స్మార్ట్‌ఫోన్ బ్యాటరీ లైఫ్‌ను పెంచుకోవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ టెక్ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* స్మార్ట్‌ఫోన్ భద్రత కోసం ప్రతీ ఒక్కరూ ఫోన్ పౌచ్‌ను ఉపయోగిస్తారని తెలిసిందే. అయితే ఫోన్ పౌచ్‌లో పెట్టి ఛార్జింగ్ చేయడం మంచిది కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల బ్యాటరీ త్వరగా వేడెక్కుతుంది ఇది బ్యాటరీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. ఈ కారణంగా ఛార్జింగ్ కూడా ఆలస్యం అవుతుంది. అందుకే ఫోన్ ఛార్జింగ్ చేసే సమయంలో ఫోన్ పౌచ్‌ను తీసేయడమే ఉత్తమం అని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.
* ఇక ప్రస్తుత ఫాస్ట్ ఛార్జర్‌లు అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ ప్రత్యేకమైన ఛార్జర్‌ల ద్వారా ఫోన్ ఛార్జింగ్ త్వరగా అవుతుంది. అయితే ప్రతీరోజూ ఇలాంటి ఫాస్ట్ ఛార్జర్‌లను ఉపయోగించడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. 40 వాట్స్ అంతకంటే ఎక్కువ కెపాసిటీ కలిగిన ఛార్జర్‌లను ఎక్కువకాలం ఉపయోగిస్తే బ్యాటరీ హెల్త్ క్షీణిస్తుందని చెబుతున్నారు. అందుకే వీటికి బదులుగా నాణ్యమైన స్లో చార్జర్‌లను ఉపయోగించడం ఉత్తమమని టెక్ నిపుణులు చెబుతున్నారు.
* ఇక బ్యాటరీని ప్రతీసారి 100 శాతం ఛార్జింగ్ చేయడం మంచిది కాదని టెక్ నిపుణులు చెబుతున్నారు. మనలో చాలా మంది రాత్రంతా ఛార్జింగ్ పెట్టేస్తుంటారు. అయితే ఇలా చేయడం వల్ల బ్యాటరీ పనితీరు దెబ్బ తింటుంది. అందుకే బ్యాటరీ ఛార్జింగ్ ఎట్టి పరిస్థితుల్లో 80 శాతం కంటే ఎక్కువ కాకుండా చూసుకోవాలి.
* అలాగే బ్యాటరీ ఛార్జింగ్ పూర్తిగా తగ్గే వరకు కూడా చూసుకోకూడదని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బ్యాటరీ 20 శాతం కంటే తగ్గకూడదని సూచిస్తున్నారు. ఇలా ఛార్జింగ్ పూర్తిగా తగ్గడం వల్ల బ్యాటరీ లైఫ్‌టైమ్ గణనీయంగా దెబ్బ తింటుంఉది. కాబట్టి బ్యాటరీ 20 శాతం తగ్గకుండా, 80 శాతం పెరగకుండా చూసుకోవాలని టెక్ నిపుణులు చెబుతున్నారు.