Flipkart Sale: మామూలు ఆఫర్లు కాదమ్మా.. భారీగా తగ్గిన ఐఫోన్, సామ్‌సంగ్, వివో ఫోన్ల ధరలు.. పోతే కష్టమే..!
Flipkart Sale: ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్ ప్రకటించింది. సేల్‌లో ఐఫోన్, వివో, సామ్‌సంగ్ ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.
Flipkart Sale: ప్రుముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్ వినియోగదారులను ఆకట్టుకొనేందుకు మంత్ ఎండ్ మొబైల్ ఫెస్ట్ సేల్ ప్రకటించింది. ఈ సేల్ నేటి నుంచి ఆగస్టు 26 వరకు లైవ్ కానుంది. మీరు సేల్‌లో దాదాపు అన్ని మొబైల్స్‌ను భారీ డిస్కౌంట్‌లతో కొనుగోలు చేయవచ్చు. అదే సమయంలో Apple, Samsung,Vivo ఫోన్లను బంపర్ డిస్కౌంట్లతో దక్కించుకోవచ్చు.సేల్‌లో సామ్‌సంగ్,వివో ఫోన్‌లపై రూ.5000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. అలానే డీల్‌లో మీరు ఆకర్షణీయమైన క్యాష్‌బ్యాక్, ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌లలో కూడా ఈ ఫోన్‌లను కొనుగోలు చేయవచ్చు. అయితే ఎక్స్‌ఛేంజ్ అనేది కంపెనీ పాలసీ, ఫోన్ , బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. ఐఫోన్ 14ని రూ.16 వేలకే కొనుగోలు చేయవచ్చు. ఈ క్రమంలో సేల్‌లో అందుబాటులో ఉన్న టాప్ 3 డీల్స్ గురించి తెలుసుకుందాం.
iPhone 14 (ఐఫోన్ 14)
ఫ్లిప్‌కార్ట్ మంత్ ఎండ్ మొబైల్స్ ఫెస్ట్‌లో ఫోన్ 14 పర్పుల్ కలర్ వేరియంట్ 512 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో రూ. 89,999కి అందుబాటులో ఉంది. విశేషమేమిటంటే సేల్ లో ఈ ఫోన్ ను కొనుగోలు చేసేందుకు నెట్ బ్యాంకింగ్ లేదా యూపీఐని ఉపయోగిస్తే రూ.16 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. ఇది కాకుండా సేల్‌లో అన్ని బ్యాంకుల కార్డ్ లావాదేవీలపై కంపెనీ రూ.16,000 తగ్గింపును కూడా ఇస్తోంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ హోల్డర్‌లకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీరు ఈ ఫోన్‌ను ఆకర్షణీయమైన EMIలో కూడా కొనుగోలు చేయవచ్చు. మీరు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 42,100 వరకు బెనిఫిట్ పొందొచ్చు. ఐఫోన్ 14లో 12 మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంటుంది. ఫోన్ A15 బయోనిక్ చిప్‌సెట్‌లో పనిచేస్తుంది.
Samsung Galaxy A35 5G( సామ్‌సంగ్ గెలాక్సీ A35 5G)
8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఈ ఫోన్ ధర రూ.30,999. ఈ ఫోన్‌పై కంపెనీ రూ.5 వేల తగ్గింపును ఇస్తోంది. ఈ తగ్గింపు కోసం మీరు HDFC, SBI లేదా ICICI బ్యాంక్ కార్డ్ ఉపయోగించాలి. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించే వినియోగదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్ ధరను రూ. 24,150 తగ్గించవచ్చు. ఈ Samsung ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది. ఫోన్ Exynos 1380 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.
Vivo V30e (వివో V30e)
ఫ్లిప్‌కార్ట్‌లో8 జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్న ఫోన్ వేరియంట్ ధర రూ.27,999. సేల్‌లో మీరు బ్యాంక్ ఆఫర్‌లో రూ. 1500 తగ్గింపుతో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు.అలానే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా పేమెంట్ చేస్తే వినియోగదారులకు 5 శాతం క్యాష్‌బ్యాక్ పొందుతారు. ఈ ఫోన్‌పై కంపెనీ రూ.17,700 వరకు ఎక్స్ఛేంజ్ బోనస్ కూడా ఇస్తోంది. ఫీచర్ల విషయానికొస్తే, మీరు ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా,5500mAh బ్యాటరీని చూస్తారు.