Flipkart New Sale: కొత్త సేల్ వచ్చింది.. రూ.6,999కే బ్రాండెడ్ ఫోన్లు.. ఆఫర్లు అరాచకం..!

Flipkart New Sale: ఫ్లిప్‌కార్ట్‌ భారీ ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రకటించింది. ఈ మూడు ఫోన్లను తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

Update: 2024-08-26 09:43 GMT

Flipkart New Sale

Flipkart New Sale: ఈ కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్‌ ఈరోజు నుంచి భారీ ఎలక్ట్రానిక్స్ సేల్ ప్రారంభించింది. ఆగస్ట్ 28 వరకు జరిగే ఈ సేల్‌లో మీరు దాదాపు అన్ని టాప్ కంపెనీల ఫోన్‌లను భారీ ఆఫర్‌లు, డీల్స్‌తో కొనుగోలు చేయవచ్చు. అలానే మీరు Samsung, Motorola, Vivo ఫోన్లను కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ సేల్‌ను అస్సలు మిస్ అవ్వకండి. ఇందులో మీరు కేవలం రూ. 6999కి కొత్త ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. సేల్ పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

1. Motorola G04s
4 GB RAM+ 64 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ Motorola ఫోన్ ధర రూ.6,999. మీరు ఈ ఫోన్‌ని 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. మీరు ఈ ఫోన్‌ను రూ. 247 ప్రారంభ EMI వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో మీరు ఈ ఫోన్‌ ధర రూ. 5,800 వరకు తగ్గుతుంది. ఫీచర్ల గురించి మాట్లాడితే ఈ ఫోన్‌లో 6.6 అంగుళాల HD + డిస్‌ప్లే ఉంటుంది. ఫోన్ మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్స్. ఈ ఫోన్ Unisoc T606 ప్రాసెసర్‌పై పనిచేస్తుంది.

2.Samsung Galaxy M14 4G
4 GB RAM + 64 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఈ Samsung ఫోన్ ఎలక్ట్రానిక్స్ సేల్‌లో రూ. 8798కి అందుబాటులో ఉంది. మీరు 5 శాతం క్యాష్‌బ్యాక్‌తో ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. క్యాష్‌బ్యాక్ కోసం మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లింపు చేయాలి. డిస్కౌంట్ ఆఫర్‌లో ఫోన్ ధర రూ. 1200 వరకు తగ్గుతుంది. బ్యాంక్ ఆఫర్‌తో ఈ ఫోన్ రూ.7778కి మీ సొంతం అవుతుంది. ఫోన్ EMI రూ. 310 నుండి ప్రారంభమవుతుంది. కంపెనీ ఈ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 6000mAh బ్యాటరీని అందిస్తోంది.

3. Vivo T3 Lite 5G
Flipkart సేల్‌లో 4 GB RAM+ 128 GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ ఫోన్ ధర రూ.10,499. సేల్‌లో ఫోన్‌ను కొనుగోలు చేయడానికి మీరు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ ద్వారా చెల్లించినట్లయితే మీకు 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఫోన్ EMI రూ. 370 నుండి ప్రారంభమవుతుంది. మీరు ఈ ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లో రూ. 8,900 వరకు చౌకగా కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌లో మీరు 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, డైమెన్షన్ 6300 ప్రాసెసర్‌ను చూడవచ్చు.

Tags:    

Similar News