iPhone Offer: చివరి ఛాన్స్.. రూ.50 వేల కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..!

iPhone Offer: ఫ్లిప్‌కార్ట్‌లో చాలా కాలంగా దీపావళి సేల్ లైవ్ అవుతుంది. ఈరోజు చివరి రోజు. అనేక ఐఫోన్ మోడళ్లపై సేల్ సమయంలో బంపర్ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి.

Update: 2024-11-01 06:38 GMT

iPhone Offer: చివరి ఛాన్స్.. రూ.50 వేల కంటే తక్కువ ధరకే ఐఫోన్ 15..!

iPhone Offer: ఫ్లిప్‌కార్ట్‌లో చాలా కాలంగా దీపావళి సేల్ లైవ్ అవుతుంది. ఈరోజు చివరి రోజు. అనేక ఐఫోన్ మోడళ్లపై సేల్ సమయంలో బంపర్ డిస్కౌంట్‌లు అందుబాటులో ఉన్నాయి. అయితే అతిపెద్ద ఆఫర్ ప్రస్తుతం iPhone 15లో కనిపిస్తుంది. మీరు ఐఫోన్ 15 కొనాలని ఆలోచిస్తున్నట్లయితే.. దాని ధర కొంచెం ఎక్కువగా అనిపించినట్లయితే దీపావళి చౌకగా కొనడానికి ఉత్తమ సమయంగా మారింది. ఇప్పుడు మీరు కేవలం రూ. 52,599తో ఫ్లిప్‌కార్ట్ నుండి ఫోన్ మీ సొంతం చేసుకోవచ్చు. ఈ డీల్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.

రూ. 56,599కి ధరతో ఈ కామర్స్ సైట్‌లో లిస్ట్ చేశారు. అయితే మీరు ఎస్‌బిఐ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్ ద్వారా రూ. 3250 తగ్గింపును పొందవచ్చు. ఇది కాకుండా రూ. 750 ఎక్స్‌ఛేంజ్ తగ్గింపు ఉంది. ఇది ఫోన్ ధర రూ. 52,599కి తీసుకువస్తుంది. లాంచ్ ధరను పరిశీలిస్తే మీరు ఫోన్‌లో రూ. 27 వేల వరకు ఆదా చేయవచ్చు. అదనంగా మీ దగ్గర పాత స్మార్ట్‌ఫోన్ ఉంటే మీరు దానిని ఎక్స్ఛేంజ్ బోనస్‌గా మార్చుకోవచ్చు. మీరు ఈ ఆఫర్లను కలిపితే ఫోన్ ధర రూ. 50,000 కంటే తక్కువకు వస్తుంది.

ఐఫోన్ 15 స్పెసిఫికేషన్‌ల గురించి మాట్లాడితే ఇది A16 బయోనిక్ చిప్‌తో ఉంది. ఇది గేమింగ్, మల్టీ టాస్కింగ్ లేదా హెవీ యాప్‌లను ఉపయోగించడానికి బెస్ట్‌గా పర్ఫామ్ చేస్తుంది. ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది వీడియోలను చూడటానికి లేదా Instagram ద్వారా స్క్రోలింగ్ చేయడానికి సరీగా ఉంటుంది.

కెమెరా విషయానికి వస్తే iPhone 15 కూడా 48MP ప్రైమరీ కెమెరా ,12MP అల్ట్రా-వైడ్ కెమెరాను కలిగి ఉంది. దీని అర్థం మీరు తక్కువ వెలుతురులో కూడా మంచి ఫోటోలను క్యాప్చర్ చేయచ్చు. అల్ట్రా-వైడ్ లెన్స్ కూడా చాలా బాగున్నాయి. ఇది ల్యాండ్‌స్కేప్‌లు లేదా గ్రూప్ ఫోటోలకు బెస్ట్‌గా పర్ఫామ్ చేస్తుంది. 12MP ఫ్రంట్ కెమెరా సెల్ఫీలు తీసుకోవడానికి లేదా వీడియో కాల్స్ కోసం అందించారు.

ఇది 5Gకి కూడా సపోర్ట్ ఇస్తుంది. కాబట్టి మీరు వేగవంతమైన నెట్‌వర్క్ ఆస్వాదించవచ్చు. అదనంగా ఇది రోజంతా బ్యాటరీ లైఫ్ అందిస్తుంది. MagSafe ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది మీ ఫోన్‌ను ఎటువంటి ఇబ్బంది లేకుండా ఛార్జ్ చేయడానికి చాలా సౌకర్యవంతంగా ఉంటుంది.

Tags:    

Similar News