EcoFlow Wave 2: వేసవిలో టూర్‌లకు వెళ్తున్నారా.. ఈ పోర్టబుల్ ఏసీని వెంట తీసుకెళ్లండి.. మండే ఎండలు సైతం మంచులా మారాల్సిందే..!

EF ECOFLOW Wave 2: దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఎండ తీవ్రతను తట్టుకునేందుకు గృహాలు, వ్యక్తిగత స్థావరాలు ఎయిర్ కండీషనర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి.

Update: 2024-03-31 07:30 GMT

EcoFlow Wave 2: వేసవిలో టూర్‌లకు వెళ్తున్నారా.. ఈ పోర్టబుల్ ఏసీని వెంట తీసుకెళ్లండి.. మండే ఎండలు సైతం మంచులా మారాల్సిందే..!

EF ECOFLOW Wave 2: దేశంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో, ఎండ తీవ్రతను తట్టుకునేందుకు గృహాలు, వ్యక్తిగత స్థావరాలు ఎయిర్ కండీషనర్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నాయి. అయితే, పెద్ద ఎయిర్ కండీషనర్ల నిర్వహణ ఖర్చులు చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా EcoFlow వేవ్ 2 పోర్టబుల్ ఎయిర్ కండీషనర్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

ఇంటి, బయటి వాతావరణం కోసం రెండు విధాలుగా పనిచేసే వినూత్న ఎయిర్ కండీషనర్: వేవ్ 2 ఎయిర్ కండీషనర్ మాత్రమే కాకుండా, శీతాకాలంలో వెచ్చదనం అందించే హీటర్‌గా కూడా పనిచేస్తుంది. 5100 బీటీయూ సామర్థ్యంతో 5 నిమిషాల్లో 10°C వేడిని కలిగిస్తుంది. అలాగే 6100 బీటీయూతో 5 నిమిషాల్లో 10°C వేడిని పెంచుతుంది.

బ్యాటరీతో పనిచేసే సామర్థ్యం: వేవ్ 2 పోర్టబుల్ ఎయిర్ కండీషనర్‌తో బాహ్య బ్యాటరీని అనుసంధానం చేసుకోవడం ద్వారా పనిచేసే సమయాన్ని పెంచుకోవచ్చు. ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపుగా 8 గంటలకు పైగా చల్లదనం లేదా 4 గంటల వేడిని అందించగలదు.

ఉపయోగాలు..

సంప్రదాయ ఎయిర్ కండీషనర్లతో పోల్చిస్తే తక్కువ విద్యుత్ వినియోగం.

సులభంగా వాడుకునే అవకాశం ఉంది.

ఇళ్లు, ఆఫీసులు, టెంట్‌లు, క్యాంపింగ్ కోసం ఈజీగా వాడుకోవచ్చు.

అయితే, ప్రస్తుతం ఈ పోర్టబుల్ ఏసీ కమ్ హీటర్ అందుబాటులో లేదు. ఆన్‌లైన్‌లోనూ స్టార్ లేదని చూపిస్తోంది. ధర వివరాలు కూడా అమెజాన్‌లో అందుబాటులో లేవు. ఒక్కసారి స్టాక్ అందుబాటులోకి వస్తే, ధర కూడా తెలిసే అవకాశం ఉంది.

Tags:    

Similar News