Youtube: యూట్యూబ్‌లో అత్యధికంగా చూస్తున్న వీడియోలు ఏంటో తెలుసా.?
ఇదిలా ఉంటే మరి యూట్యూబ్‌లో అత్యధికంగా ఎలాంటి వీడియోలను వీక్షిస్తున్నారు.? వేటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
Youtube: యూట్యూబ్.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న అతిపెద్ద వీడియో సెర్చ్ ఇంజన్. ప్రతీ రోజూ యూట్యూబ్‌లో కొన్ని లక్షల వీడియోలు అప్‌లోడ్ అవుతున్నాయి. కోట్లాది మంది యూజర్లు వీడియోలను వీక్షిస్తున్నారు. అన్ని రకాల వీడయోలను యూట్యూబ్‌లో వీక్షించవచ్చు. ఇక యూట్యూబ్ ద్వారా లక్షల్లో ఆదాయం ఆర్జిస్తున్న వారు కూడా ఉన్నారు. ఇదిలా ఉంటే మరి యూట్యూబ్‌లో అత్యధికంగా ఎలాంటి వీడియోలను వీక్షిస్తున్నారు.? వేటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..
* యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూస్తున్న వీడియోల్లో మ్యూజిక్ వీడియోలు మొదలు స్థానంలో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూట్యూబలో పాటల కోసం సెర్చ్ చేస్తున్నారు.
* ఇక యూట్యూబ్‌లో ఎక్కువ మంది వీడియోలు చూసే జాబితాలో గేమింగ్ వీడియోలు రెండో స్థానంలో ఉన్నాయి. గేమ్‌ప్లే, ట్యుటోరియల్‌లు, ఇ-స్పోర్ట్స్ ఈవెంట్‌లను చూడటానికి ప్రజలు పెద్ద ఎత్తున ఇష్టపడుతున్నారు.
* ఇక యూట్యూబ్‌లో ఎక్కువ మంది చూస్తున్న వీడియోల జాబితాలో.. డూ ఇట్ యూవర్ సెల్ప్ సంబంధిత వీడియోలు మూడో స్థానంలో ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా వస్తువులను రిపేర్ చేయడం, కళలు, వస్తువుల తయారీ వంటి వీడియోలు ఉన్నాయి.
* కామెడీ వీడియోలు నాలుగో స్థానంలో ఉన్నాయి. స్టాండప్ కామెడీతో పాటు స్కెచ్ కామెడీని చూడటానికి ప్రజలు ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
* ఇక యూట్యూబర్స్ నిర్వహించే వ్లాగ్ వీడియోలు 5వ స్థానంలో ఉన్నాయి. ఇందులో యూట్యూబర్స్ తమ వ్యక్తిగత జీవితాలతో పాటు పర్యాటకానికి సంబంధించిన వీడియోలు ఎక్కువగా ఉంటు్నాయి.
* వీటితో పాటు యూజర్లు ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్‌లు, చరిత్రకు సంబంధించిన వీడియోలు, చిన్నారులకు సంబంధించి కంటె్‌తో పాటు.. ఫ్యాష్, ట్రెండ్ సంబంధిత వీడియోలను చూడ్డానికి ఆసక్తి చూపిస్తున్నారు.