వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ గురించి ఈ సంగతి తెలుసా..? ఒక క్లిక్‌తో మొత్తం సమాచారం..
One Nation One Registration: భూములకు సంబంధించిన గొడవలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం డిజిటలైజ్ ప్రాసెస్ మొదలుపెట్టింది.
One Nation One Registration: భూములకు సంబంధించిన గొడవలను తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం డిజిటలైజ్ ప్రాసెస్ మొదలుపెట్టింది. వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ కింద భూ రికార్డులను డిజిటలైజ్ చేస్తుంది. దీనివల్ల భూక్రయ, విక్రయాలు జరిగేటప్పుడు ఎలాంటి వివాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయి. అంతేకాదు అన్ని వివరాలు సరిగ్గా ఉంటాయి. మార్చడానికి వీలుండదు. 2023 నాటికి మొత్తం భూ రికార్డులను డిజిటలైజ్ చేయడమే కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
వాస్తవానికి ఈ ప్రోగ్రామ్ కింద మీరు ఒక క్లిక్‌తో మీ భూమికి సంబంధించిన పత్రాలను సులభంగా చూడవచ్చు. ఎందుకంటే వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ ప్రోగ్రామ్ కింద భూములకు యూనిక్ రిజిస్టర్డ్ నంబర్ జారీ చేస్తుంది. దీని ద్వారా అన్ని వివరాలు మీకు స్క్రీన్‌పై కనిపిస్తాయి. భవిష్యత్‌లో భూములకు సంబంధించిన ఎలాంటి పనులైనా సులభంగా జరుగుతాయి. దీని వల్ల సామాన్యుల భూమికి భద్రత ఉంటుంది. 3సీ ఫార్ములాని అప్లై చేస్తుంది. అంటే 1. సెంట్రల్ ఆఫ్ రికార్డ్, 2. కలెక్షన్ ఆఫ్ రికార్డ్, 3. కన్వీనియెన్స్ ఆఫ్ రికార్డ్
వన్ నేషన్ వన్ రిజిస్ట్రేషన్ వల్ల ప్రయోజనాలు..
1. ఆధార్ తరహాలో అన్ని భూమి హోల్డింగ్‌లకు ప్రత్యేకమైన ID ఉంటుంది
2. 14 అంకెల ULPIN నంబర్ జారీ అవుతుంది.
3. దేశంలో ఎక్కడైనా భూమిని కొనుగోలు చేయడం విక్రయించడంలో ఇబ్బంది ఉండదు
4. దీనిని బ్యాంకులతో అనుసంధానించడానికి పనులు జరుగుతున్నాయి.
5. అవసరమైతే భూమికి సంబంధించిన వివాదం గురించి సమాచారం ఉంటుంది
6. భూమిని విభజించినట్లయితే ఆ భూమి ఆధార్ సంఖ్య భిన్నంగా ఉంటుంది.
భూముల విషయంలో చాలా గొడవలు జరుగుతుంటాయి. కొంతమంది ప్రభుత్వ భూమిని కూడా ఆక్రమించుకుంటారు. కానీ భూమి హోల్డింగ్‌కు యూనిక్ ఐడీ జారీ చేసిన తర్వాత అలాంటి కేసులు ఖచ్చితంగా తగ్గుతాయి. సగానికి పైగా కేసులు పరిష్కారమవుతాయి. అది చాలా సులభతరం చేస్తుంది. ఇందులో అన్నీ ఆధార్ తరహాలోనే ఉంటాయి. డిజిటల్ రికార్డుల వల్ల భూమి వాస్తవ పరిస్థితి ఏంటో బయటపడుతుంది.