Phone Charging: ఫోన్‌ ఛార్జ్‌ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!

Phone Charging: ఈ రోజుల్లో మొబైల్‌ లేకుండా ఎవరు ఉండలేరు. అయితే పెద్ద సమస్య ఏంటంటే ఛార్జింగ్‌ మెయింటెన్ చేయడం.

Update: 2022-07-09 05:30 GMT

Phone Charging: ఫోన్‌ ఛార్జ్‌ చేసేటప్పుడు ఈ తప్పులు అస్సలు చేయకండి..!

Phone Charging: ఈ రోజుల్లో మొబైల్‌ లేకుండా ఎవరు ఉండలేరు. అయితే పెద్ద సమస్య ఏంటంటే ఛార్జింగ్‌ మెయింటెన్ చేయడం. వాస్తవానికి ఫోన్‌కి ఛార్జింగ్‌ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే మీ స్మార్ట్‌ఫోన్‌ చాలాసేపు పనిచేస్తుంది. అయితే చాలామందికి ఫోన్‌ ఛార్జింగ్‌ విషయంలో సందేహాలు, అపోహలు ఉన్నాయి. వాటి గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

మీరు ఛార్జింగ్‌ చేసేటప్పుడు నాసిరకం ఛార్జర్లని ఉపయోగించకూడదు. దీనివల్ల చార్జింగ్ సమయంలో బ్యాటరీ పై దుష్ప్రభావం పడుతుంది. చార్జింగ్ విషయంలో కంపెనీ చార్జర్‌లను ఎంపిక చేసుకోవటమే ఉత్తమం. ఫోన్ చార్జ్ అవుతోన్న సమయంలో కాల్స్ మాట్లాడమనేది ఎంత మాత్రం శ్రేయస్కరం కాదు. తప్పనిసరిగా మాట్లాడాల్సి వస్తే చార్జింగ్‌ను ఆఫ్ చేసి మాట్లాడండి. మీ ఫోన్ బ్యాటరీ పూర్తిగా చార్జ్ అయ్యాక పవర్‌ను తీసుకోవటం ఆటోమెటిక్‌గా మానేస్తుంది. అయితే నాసిరకం బ్యాటరీలు పలు సందర్భాల్లో మోరాయిస్తుంటాయి. అందకే జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి.

మీ ఫోన్ ఒక యంత్రం. దానికి ఎంతోకొంత విరామం అవసరం. రాత్రివేళ్లలో మీరు నిద్రకు ఉపక్రమించే ముందు ఫోన్‌ను ఆఫ్‌ చేయటం వల్ల బ్యాటరీ బ్యాకప్‌ను పెంచుకోవచ్చు. ప్రతిసారీ ఫోన్ బ్యాటరీ చార్జింగ్ లెవ్సల్స్ జీరో స్థాయికి చేరుకున్న తరువాత చార్జింగ్ ప్రక్రియ మొదలెట్టకూడదు. ఎప్పటికప్పుడు ఫోన్ చార్జింగ్ లెవల్స్ తగ్గకుండా చూసుకోవటం ఉత్తమం. అలాగే వేడి వాతావరణంలో ఫోన్‌ను ఉంచటం మంచిదికాదు.

Tags:    

Similar News