Smartphone: మీ ఫోన్ బ్యాటరీ హెల్తీగా ఉండాలా.? ఈ టిప్స్ పాటించండి..

అయితే మనం తెలియక చేసే కొన్ని తప్పుల కారణంగానే బ్యాటరీ పనితీరు పాడవుతుంది. ఇంతకీ బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

Update: 2024-06-18 02:45 GMT

Smartphone: మీ ఫోన్ బ్యాటరీ హెల్తీగా ఉండాలా.? ఈ టిప్స్ పాటించండి.. 

Smartphone: స్మార్ట్‌ఫోన్‌ ఉపయోగించే వారికి ఎదురయ్యే ప్రధాన సమస్యల్లో బ్యాటరీ ముఖ్యమైంది. కొన్ని రోజుల వరకు బాగా పనిచేసిన బ్యాటరీ పనితీరు ఆ తర్వాత క్రమంగా క్షీణిస్తుంది. ఎంత మంచి ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌ అయినా సరే కొన్ని రోజుల తర్వాత బ్యాటరీ పనితీరు దెబ్బతింటుంది. అయితే మనం తెలియక చేసే కొన్ని తప్పుల కారణంగానే బ్యాటరీ పనితీరు పాడవుతుంది. ఇంతకీ బ్యాటరీ పనితీరు మెరుగ్గా ఉండాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఫోన్‌ను ఛార్జింగ్‌ చేసే సమయంలో ఎల్లప్పుడు ఒరిజిలన్‌ ఛార్జర్లను, కేబుల్‌లను ఉపయోగించాలి. ముఖ్యంగా కంపెనీతో వచ్చే ఛార్జర్లనే ఉపయోగించాలి. వీటివల్ల బ్యాటరీ పనితీరు మెరుగవుతుంది.

* ఫోన్‌ ఛార్జింగ్‌ అవుతోన్న సమయంలో స్మార్ట్‌ ఫోన్‌ను ఉపయోగించడం ఇటీవల సాధారణంగా మారింది. ముఖ్యంగా సాంగ్స్‌ వినడం, వీడియోలు చూడడం, గేమ్స్‌ ఆడడం లాంటివి చేస్తున్నారు. అయితే ఛార్జింగ్‌ అవుతున్న సమయంలో ఇలా చేయడం వల్ల బ్యాటరీపై ఒత్తిడి పెరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి.

* ఇక బ్యాటరీని ఎట్టి పరిస్థితుల్లో 100 శాతం అయ్యే వరకు ఛార్జింగ్ చేయకూడదని గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఛార్జింగ్‌ 20 శాతం తగ్గకుండా చూడకుండా చూసుకోవాలి. ఫోన్‌ బ్యాటరీ 20 శాతం తగ్గకుండా, 90 శాతం కంటే ఎక్కువగా ఉండకుండా చూసుకోవాలి. ఇలా చేస్తే బ్యాటరీ లైఫ్‌ పెరుగుతుంది. నిత్యం ఫుల్ ఛార్జ్‌, ఫుల్ డిశ్చార్జ్ వల్ల బ్యాటరీ త్వరగా పాడవుతుంది.

* మనలో చాలా మంది రాత్రంతా ఫోన్‌ను ఛార్జింగ్‌లో పెట్టు ఉంచుతుంటారు. ఇలా ఎక్కువసేపు ఛార్జింగ్ పెట్టడం వల్ల బ్యాటరీపై ప్రభావం పడుతుంది. రాత్రంతా ఛార్జింగ్ పెడితే బ్యాటరీ హెల్త్‌ దెబ్బతింటుంది.

* కొందరు టీవీలపై, ఫ్రిడ్జ్‌లపై పెట్టి ఫోన్‌ను ఛార్జింగ్‌ పెడుతుంటారు. ఇలా చేయడం వల్ల కూడా ఫోన్‌ బ్యాటరీ మరింత వేడెక్కి, పనితీరు దెబ్బతినే ప్రమాదం ఉంటుంది.

Tags:    

Similar News