Oxygen Levels: ఆక్సిజన్ లెవల్స్.. మీ స్మార్ట్‌ఫోన్‌తోనే తెలుసుకోండిలా!
కరోనా సెకండ్ వేవ్‌తో దేశం వణికిపోతోంది. ఓవైపు కేసుల నమోదు గతకొద్ది రోజులుగా తగ్గుతున్నా.. మరణాలు మాత్రం పెరుగుతున్నాయి.
Oxygen Levels: కరోనా సెకండ్ వేవ్‌తో దేశం వణికిపోతోంది. ఓవైపు కేసుల నమోదు గతకొద్ది రోజులుగా తగ్గుతున్నా.. మరణాలు మాత్రం భారీగానే పెరుగుతున్నాయి. దీనికి తోడు బ్లాక్, వైట్ ఫంగస్‌లు కూడా ప్రజలను కలవరపెడుతున్నాయి. అయితే, ఎక్కువ కేసుల్లో ఆక్సిజన్ అందక ఇబ్బందులు పడుతున్నవారే అధికంగా కనిపిస్తున్నారు. దీంతో ఆక్సీజన్ లెవల్స్ చెక్ చేసుకునేందుకు ప్రజలు ఆరాటపడుతున్నారు. దీనివల్ల పల్స్ ఆక్సీమీటర్లు, స్మార్ట్ వాచ్‌లకు విపరీతంగా డిమాండ్ పెరిగింది. అయితే, డిమాండ్ పెరగడంతో వీటి రేట్లు కూడా భారీగానే పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఎలాంటి ఖర్చు పెట్టకుండానే చాలా ఈజీగా మన స్మార్ట్‌ఫోన్‌తో శరీరంలోని ఆక్సిజన్ స్థాయి, పల్స్, శ్వాసక్రియల రేట్లు తెలుసుకోవచ్చు. యాప్‌తోనే మన ఇంట్లో కూర్చొనే వీటి స్థాయిలను తెలుకోవచ్చు. కోల్‌కతాకు చెందిన 'కేర్ నౌ హెల్త్‌కేర్' అనే సంస్థ 'కేర్‌ప్లిక్స్ వైటల్స్ యాప్' ను తయారుచేసింది. దీంతో మన శరీరంలోని ఆక్సీజన్ స్థాయిలు తెలుకోవచ్చని సంస్థ పేర్కొంది. దీంతో 96 శాతం కచ్చితమైన ఫలితాలు వస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
పనితీరు..
కృత్రిమ మేధ (ఆర్టిఫిసీయల్ ఇంటిలిజెన్ప్ టెక్నాలజీ), ఫోటో ప్లెథిస్మోగ్రఫీ సాయంతో ఈ యాప్ పనిచేస్తుంది. ఆక్సీమీటర్లు ఇన్‌ఫ్రారెడ్ సెన్నార్లతో పనిచేయగా, ఈ యాప్ మాత్రం మన స్మార్ట్‌ఫోన్‌లోని ఫ్లాస్‌లైట్ తో పనిచేయనుంది. ఫ్లాస్‌లైట్ పై వేలును ఉంచి మన శరీరంలోని ఆక్సీజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు.
వాడడం ఎలా..
1. ముందుగా ఈ యాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అయితే ఈ యాప్ ప్రస్తుతం ఐవోఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఆండ్రాయిడ్ యూజర్లు https://vitals.careplix.com/ సైట్‌లోకి వెళ్లి, ఏపీకే ను డౌన్‌లోడ్ చేసుకుని ఇన్‌స్టాల్ చేసుకోవాలి. త్వరలోనే ప్లే స్టోర్‌లో అందుబాటులోకి రానుంది.
2. ఇన్‌స్టాల్ చేశాక రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తిచేయాలి. ఆ తరువాత వెల్‌కం స్ర్కీన్ కనిపిస్తుంది. ఇందులో రికార్డ్ వైటల్స్ ఆఫ్షన్‌ను ఎంచుకోవాలి.
3. ఆ తరువాత స్టార్ట్ స్కాన్ బటన్‌పై క్లిక్ చేయాలి. దీంతో మన ఫోన్‌లోని ప్లాస్ లైట్ ఆన్ అవుతుంది. అప్పుడు మన చూపుడు వేలును ఫ్లాష్‌లైట్, కెమెరాలపై ఉంచాలి. పూర్తిగా కవర్ చేయాలి.
4. అప్పుడు మన నలభై సెకన్లలో ఆక్సిజన్, పల్స్, శ్వాసక్రియ రేట్లను యాప్‌లో రికార్డు చేస్తుంది. ఆ తరువాత మనకు పూర్తి రిపోర్ట్‌ను చూపిస్తుంది.
5. ఎన్నిసార్లైనా చెక్ చేసుకోవచ్చు. అలాగే రికార్డైన రిజల్ట్స్‌ను వైటల్స్ హిస్టరీలోకి వెళ్లి చూసుకోవచ్చు.