Cert-in: క్రోమ్ 92 వెర్షన్ అప్డేట్ చేసుకొండి.. హ్యాకింగ్ బారిన పడకండి

Update: 2021-08-12 10:17 GMT

క్రోమ్ అప్డేట్ (ట్విట్టర్ ఫోటో)

Cert-in Alerts: ప్రపంచ వ్యాప్తంగా అటు ఆండ్రాయిడ్ మొబైల్ లోనే కాకుండా విండోస్ కంపూటర్లలోనూ అత్యధికంగా ఉపయోగించే సెర్చ్ ఇంజన్ గూగుల్ క్రోమ్. ఎలాంటి వార్త అయిన గూగుల్ లో సెర్చ్ కోసం క్రోమ్ ని ఉపయోగించే జనాలు ఎక్కువ. మొబైల్ మరియు కంపూటర్లలో డిఫాల్ట్ గా ఉండే ఈ క్రోమ్ ని వెంటనే అప్డేట్ చేసుకోవాలని లేదంటే హ్యాక్ అయ్యే ప్రమాదం ఉందని కంప్యూటర్ ఎమెర్జెన్సి రెస్పాన్స్ టీం (Cert-in) హెచ్చరించింది. ప్రస్తుత వెర్షన్ నుండి వెర్షన్ 92 కి అప్డేట్ అవ్వాలని నోడల్ ఏజెన్సీ సూచించింది.

ప్రస్తుతం ఉన్న గూగుల్ క్రోమ్ వెర్షన్ లో కొన్ని సెక్యూరిటీ లోపాలను గుర్తించిన కంప్యూటర్ ఎమెర్జెన్సి రెస్పాన్స్ టీం తాజాగా నిర్ణయం తీసుకుంది. గూగుల్ క్రోమ్ యూజర్లు వెంటనే లేటెస్ట్ వెర్షన్ 92.0.4515.131 తో అప్డేట్ అవ్వాలని తెలిపింది. ఇలా అప్డేట్ అవడం ద్వారా సుమారుగా పలు రకాల హ్యాకర్ల బారిన పడకుండా తమ మొబైల్ మరియు కంపూటర్లలో సమాచారాన్ని కాపాడుకోవచ్చని సలహా ఇచ్చింది. ఇక ఇటీవలె ఐఫోన్ యూజర్లకు సైతం iOS 14.7.1 మరియు iPadOS 14.7.1 తో అప్డేట్ అవ్వాలని మినిస్ట్రీ అఫ్ ఎలెక్ట్రానిక్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కొన్ని సూచనలు చేసింది.

క్రోమ్ ఆన్ విండోస్ 92.0.4515.131

క్రోమ్ ఆన్ ఆండ్రాయిడ్ 92.0.4515.131

క్రోమ్ అన్ లైనక్స్ 92.0.4515.131

క్రోమ్ ఆన్ ఐఓఎస్ 14.7.1

Tags:    

Similar News