BSNL Customers: బీఎస్‌ఎన్‌ఎల్ కస్టమర్లకి షాక్.. ఈ చౌకైన బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ క్లోజ్..!
BSNL Customers: ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( BSNL) 2022 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
BSNL Customers: ప్రభుత్వ టెలికాం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ ( BSNL) 2022 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా కొత్త ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ధర రూ.275. ఇది 1 నెల వ్యాలిడిటీతో వస్తుంది. ప్రయోజనాల గురించి చెప్పాలంటే ఈ ప్లాన్‌లో వినియోగదారులు 60 Mbps వేగంతో 3300GB (3.3TB) వరకు యాక్సెస్ చేయగలరు. డేటా కోటా పరిమితి ముగిసిన తర్వాత ఇంటర్నెట్ వేగం 2Mbpsకి పడిపోతుంది.
ఇది చాలా సరసమైన ఆఫర్. BSNL సేవను ప్రయత్నించాలనుకునే ఎవరికైనా ఇది గొప్ప ప్లాన్ అని చెప్పవచ్చు. ఇది ప్రమోషనల్ ప్లాన్ కాబట్టి పరిమిత సమయం కేటాయించింది. ఇప్పుడు BSNL ఈ ఆఫర్ గడువు తేదీని వెల్లడించింది. BSNL రూ.275 ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ రెండు ఆప్షన్లలో అందుబాటులో ఉంది. రెండు ఆప్షన్లు ఫిక్స్‌డ్ లైన్ వాయిస్ కాలింగ్ కనెక్షన్‌ను అందిస్తాయి. డేటా అయిపోయిన తర్వాత వేగం 2 Mbpsకి తగ్గిపోతుంది. రెండు ఆఫర్ల మధ్య వ్యత్యాసం ఏంటంటే ఒక రూ.275 ప్లాన్ 30 Mbps స్పీడ్‌ని అందిస్తోంది, మరొకటి 60 Mbps స్పీడ్‌ను అందిస్తుంది.
టెలికాం టాక్ నివేదిక ప్రకారం.. రూ.275 రెండు ప్లాన్ ప్లాన్‌లు 13 అక్టోబర్ 2022న క్లోజ్ అవుతాయి. అంటే అక్టోబర్ 13 తర్వాత కస్టమర్‌లు ఈ ప్లాన్‌ను పొందలేరు. ఈ ప్లాన్ కొత్త కస్టమర్లతో పాటు ఇప్పటికే ఉన్న కస్టమర్లకు కూడా అందుబాటులో ఉంది. BSNL రూ.275 ఫైబర్ బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ BSNL ఫైబర్ ఎంట్రీ ప్లాన్ కంటే చౌకనైది. దీని ధర నెలకు రూ.329 రూపాయలుగా ఉంది. 1TB డేటా వస్తుంది.