Smart Phone: మీ స్మార్ట్‌ఫోన్‌ పోయిందా వెంటనే ఇలా చేయండి.. లేదంటే చాలా నష్టం..?

Smart Phone: స్మార్ట్‌ఫోన్‌ నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే. అది లేకపోతే ప్రస్తుత కాలంలో ఏ పని జరుగదు.

Update: 2022-02-01 15:30 GMT

Smart Phone: మీ స్మార్ట్‌ఫోన్‌ పోయిందా వెంటనే ఇలా చేయండి.. లేదంటే చాలా నష్టం..?

Smart Phone: స్మార్ట్‌ఫోన్‌ నిత్య జీవితంలో ప్రతి ఒక్కరికి ఎంత ముఖ్యమో అందరికి తెలిసిందే. అది లేకపోతే ప్రస్తుత కాలంలో ఏ పని జరుగదు. ముఖ్యంగా డబ్బు లావాదేవీలన్ని దీంతో ముడిపడి ఉంటాయి. అలాంటిది స్మార్ట్‌ఫోన్‌ని ఎంత జాగ్రత్తగా చూసుకోవాలో చెప్పనక్కరలేదు. కానీ కొన్ని అనుకోని సందర్భాలో ఫోన్‌ ఎవరైనా దొంగిలించడం లేదా ఎక్కడైనా పోగొట్టుకోవడం జరుగుతాయి. అలాంటి సమయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఎందుకంటే చాలామంది బ్యాంక్‌ డీటెయిల్స్‌, ఆధార్‌ కార్డ్‌, పాన్‌ కార్డ్‌ వంటి ముఖ్య విషయాలు అన్నీ అందులోనే సేవ్‌ చేసి ఉంచుతారు. దీంతో ఎవ్వరైనా మీ బ్యాంకు అకౌంట్‌ నిమిషాల్లో ఖాళీ చేసేయవచ్చు.

స్మార్ట్‌ఫోన్ పోయినప్పుడు ముందుగా బ్యాంక్‌ అకౌంట్‌లో ఉన్న డబ్బు కాపాడుకోవడం ముఖ్యం. అందుకే ముందుగా టెలికాం కంపెనీకి ఫోన్‌ చేసి మొబైల్‌ నెంబర్‌ బ్లాక్ చేయమని చెప్పాలి. ఫోన్‌ పోతే కొత్త నెంబర్, కొత్త మొబైల్‌ కొనుక్కోవచ్చు అనుకుంటారు కానీ మీ పాత నెంబర్ దుర్వినియోగం అవుతుంది. సిమ్‌ కార్డ్‌ బ్లాక్‌ చేయడం వల్ల దొంగలు మీ బ్యాంకు అకౌంట్‌ని యాక్సెస్ చేయలేరు. అంతేకాదు మీ డెబిట్‌ కార్డ్‌, క్రెడిట్‌ కార్డ్‌ అన్ని మీ మొబైల్‌ నెంబర్‌కి లింక్‌ అయి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి.

అంతేకాదు ప్రస్తుతం అందరు Paytm, PhonePe వంటి అనేక మొబైల్ వాలెట్లు వాడుతున్నారు. దీని సహాయంతో నిమిషాల్లో లావాదేవీ పూర్తి చేయవచ్చ. అందువల్ల ఫోన్ పోయినట్లయితే SIMకార్డ్‌ను బ్లాక్ చేయడంతో పాటు మొబైల్ వాలెట్ యాక్సెస్‌ను కూడా బ్లాక్ చేయాలి. అలాగే దగ్గరలోని పోలీస్‌ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇవ్వాలి. ఎఫ్ఐఆర్‌ కాపీ దగ్గర ఉంచుకోవాలి. అంతేకాదు సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (CEIR) పోర్టల్ ద్వారా దొంగిలించబడిన లేదా పోగొట్టుకున్న మొబైల్‌ను బ్లాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. 

Tags:    

Similar News