Mobile Digital Apps: మొబైల్ డిజిటల్ యాప్స్ లో లోన్ తీసుకుంటున్నారా..అయితే జాగ్రత్త..మీ జేబుకు భారీ చిల్లు పడే చాన్స్

Mobile Digital Apps: లోన్ యాప్స్ ఆగడాల గురించి మనం వార్తల రూపంలో ఎన్నో చదివే ఉంటాము. అయినప్పటికీ వీటి మార్కెట్ అనేది రోజురోజుకు పెరుగుతూనే ఉంది. వీరిని కట్టడి చేసేందుకు ఎన్ని కఠిన చట్టాలు తెచ్చినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది. ముఖ్యంగా మార్కెట్లో చిన్న మధ్యతరగతి పేద ప్రజలు తమ నిత్య అవసరాల కోసం రుణాలపై ఆధారపడుతున్నారు. చదువు, వైద్యం, వివాహం, ఇంటి ఖర్చులు ఇలా అనేక అవసరాలకు డబ్బు అనేది ప్రాథమిక అవసరంగా మారుతోంది. ఈ బలహీనతనే లోన్ యాప్స్ ఆసరాగా తీసుకొని చెలరేగిపోతున్నాయి.

Update: 2024-08-01 04:37 GMT

Mobile Digital Apps: మొబైల్ డిజిటల్ యాప్స్ లో లోన్ తీసుకుంటున్నారా..అయితే జాగ్రత్త..మీ జేబుకు భారీ చిల్లు పడే చాన్స్

Mobile Digital Apps:గత కొన్నేళ్లుగా దేశంలో డిజిటల్ యాప్స్ ద్వారా రుణాలు తీసుకునే వారి సంఖ్య వేగంగా పెరిగింది. ఇంట్లో కూర్చునే యాప్‌లో ఇప్పుడు సులభంగా లోన్ పొందే అవకాశం ఉంది. ఇకపై మునుపటిలా బ్యాంకుకు వెళ్లాల్సిన అవసరం లేకుండానే పలు ఫిన్‌టెక్ కంపెనీలు , ఆర్థిక సంస్థలతో పాటు, ఇప్పుడు మొబైల్ డిజిటల్ యాప్స్ మీకు నిమిషాల్లో రుణాన్ని అందిస్తున్నాయి, అయితే ఈ డిజిటలైజేషన్ కారణంగా, లోన్ యాప్స్ పేరిట జరుగుతున్న మోసాలు కూడా చాలా పెరిగాయి. లోన్ కోసం అప్లై చేసేటప్పుడు మీరు జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. లోన్ యాప్స్ విషయంలో జరిగే మోసాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

అన్ని లోన్ యాప్‌లు నమ్మదగినవి కావు:

లోన్ యాప్ ద్వారా మీరు పొందాలనుకుంటున్నారా..అయితే పలు రకాల ఫిన్‌టెక్ కంపెనీలు మీకు ఈ సేవలు అందిస్తున్నాయి. అయితే కొన్ని అనధికారికంగా కూడా మీకు లోన్లు అందిస్తున్నాయి. RBI విడుదల చేసిన ఒక నివేదికలో 1100 డిజిటల్ లోన్ ఇచ్చే ప్లాట్‌ఫారమ్‌లలో 600 చట్టవిరుద్ధమైనవిగా గుర్తించింది. ఈ యాప్‌లు అధిక వడ్డీ రేట్లు, ఇతర ఛార్జీలతో రుణాలు అందిస్తున్నట్లు గుర్తించారు. మీరు రుణ చెల్లింపులో ఏ మాత్రం ఆలస్యం చేసినా, ఈ యాప్‌లు మిమ్మల్ని ఇబ్బంది పెట్టేందుకు ఏ మాత్రం ఆలోచించవు.

సైబర్ నేరాలకు పాల్డపుతున్న లోన్ యాప్స్:

ఈ లోన్ యాప్స్ తమ కస్టమర్లను ఆకర్షించేందుకు పలు ప్రలోభాలకు సైతం దిగుతుంటాయి. అంతేకాదు పలు నకిలీ డిజిటల్ డాక్యుమెంట్‌లు, వెబ్ పేజీలను తయారుచేస్తుంటాయి.

ప్రైవసీకి గ్యారంటీ లేదు:

లోన్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పుడు రుణదాత వివిధ వ్యక్తిగత పత్రాలను లోన్ యాప్‌కు సమర్పిస్తారు. ఇటువంటి అనధికార యాప్‌లు మీ మొబైల్ ఫోన్‌లోని , పరిచయాలు, ఫైల్‌లు మొదలైన ప్రైవేట్ ఫోల్డర్‌లను యాక్సెస్ చేస్తాయి ఈ మోసపూరిత యాప్‌లు మీ డేటాను సురక్షితంగా గోప్యంగా ఉంచవు.

ఈ యాప్‌లు ఇతర అక్రమాలకు కూడా పాల్పడుతున్నాయి:

ఈ లోన్ ఇచ్చే యాప్‌లు అన్యాయమైన మార్కెటింగ్ పద్ధతులను ఉపయోగిస్తాయి. రుణ రికవరీ పద్ధతిపై ఇప్పటికే ఆర్‌బిఐ కఠినమైన మార్గదర్శకాలను జారీ చేసింది అయినప్పటికీ వీటిని ఈ యాప్స్ పాటించడం లేదు.

అయితే నకిలీ లోన్ యాప్స్ ఆగడాలను అరికట్టాలంటే… ముందుగా మీరు స్థానిక పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పాటు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేయాల్సి ఉంటుంది. అప్పుడే ఈ నకిలీ లోన్ యాప్స్ ఆగడాలను అరికట్టే వీలు దక్కుతుంది..

Tags:    

Similar News