AC Tips: ఎండలు మండుతున్నాయని, ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. ఏసీ పేలడం ఖాయం.. ఈ చిట్కాలు పాటిస్తే బెటర్..

AC Mistakes Make Short Circuit: గత కొద్ది రోజులుగా వేడి విపరీతంగా పెరిగిపోతోంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 50 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైంది.

Update: 2024-06-02 08:30 GMT

AC Tips: ఎండలు మండుతున్నాయని, ఇలాంటి తప్పులు చేస్తున్నారా.. ఏసీ పేలడం ఖాయం.. ఈ చిట్కాలు పాటిస్తే బెటర్..

AC Mistakes Make Short Circuit: గత కొద్ది రోజులుగా వేడి విపరీతంగా పెరిగిపోతోంది. భారతదేశంలోని అనేక ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 50 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదైంది. కూలర్, ఏసీ కూడా సరిగా పనిచేయడం లేదంటే.. అర్థం చేసుకోవచ్చు. అలాగే, వేడి కారణంగా ఏసీ చెడిపోయే ప్రమాదం ఉంది. అనేక చోట్ల ఏసీలు పేలుతున్నట్లు వార్తలు కూడా వస్తున్నాయి. వేసవిలో షార్ట్‌సర్క్యూట్‌ వల్ల అగ్నిప్రమాదాలు ఎక్కువగా జరుగుతుంటాయి. విద్యుత్ ఓవర్‌లోడ్, ఏసీ యూనిట్ వేడెక్కడం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి.

ప్రస్తుతం ఎండాకాలం కావడంతో రోజంతా ఎయిర్ కండీషనర్‌ కింద కూర్చోవాలని అందరూ అనుకుంటున్నారు. ఈ కారణంగా ప్రజలు ఏసీని నిరంతరం ఆన్‌లో ఉంచాలని కోరుకుంటున్నారు. అయితే అది మెషీన్ అనే విషయం గుర్తుంచుకోవాలి. దానికి రెస్ట్ ఇవ్వకపోతే వేడెక్కిపోతుందని గుర్తించాలి. ఇది మనలో చాలా మంది చేస్తున్న తప్పు. ఏసీని ఎల్లవేళలా ఆన్‌లో ఉంచితే, అది వేగంగా వేడెక్కుతుంది. దాని కారణంగా మంటలు వ్యాపిస్తాయి. అందువల్ల, ఏసీ యూనిట్ చల్లబడేందుకు కొంత సమయం పాటు AC స్విచ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది.

వడపోత- ఏసీని కంటిన్యూగా నడపాలని ఆలోచిస్తుటాం. కానీ, ఒక నెల పాటు దాని నుంచి చల్లని గాలిని కూడా వినియోగిస్తున్నాం. కానీ, దాని ఫిల్టర్‌పై శ్రద్ధ చూపని వారు చాలా మంది ఉన్నారు. AC ఫిల్టర్‌పై దట్టమైన దుమ్ము పేరుకుపోతే, అది పని చేయడానికి చాలా శ్రమ పడుతుంది. ఇది AC వేడెక్కడానికి కారణమవుతుంది. అందువల్ల, ఏసీ ఫిల్టర్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలని సూచించారు.

అవుట్‌డోర్ యూనిట్‌ను శుభ్రపరచడం- స్ప్లిట్ AC అవుట్‌డోర్ యూనిట్ టెర్రస్ లేదా బాల్కనీలో ఉంటుంది. అందువల్ల, ఆకులు లేదా ఏదైనా చెత్త సులభంగా అందులో చేరుతుంది. ఔట్ డోర్ యూనిట్ నుంచి గాలి ఆగినొతే, అది వేగంగా వేడెక్కుతుంది. అందువల్ల, చెత్తను పైపు లేదా స్ప్రే వాటర్‌తో చాలా సున్నితంగా శుభ్రం చేయండి.

ఎక్కువ స్థలం ఉండాలి - మీరు ఔట్ డోర్ యూనిట్‌ను ఎక్కడ ఉంచారో, దాని చుట్టూ కనీసం 2 అడుగుల ఖాళీ స్థలం ఉండాలి, తద్వారా గాలి ప్రవాహం కొనసాగుతుంది.

ఎక్స్‌టెన్షన్ రాడ్- ఏ రకమైన ఎయిర్ కండీషనర్‌కైనా ప్రత్యేక సర్క్యూట్‌ను కలిగి ఉండటం చాలా ముఖ్యం. అందువల్ల, ఏసీని ఎక్స్‌టెన్షన్ బోర్డ్ లేదా వైర్‌కి కనెక్ట్ చేయడం ద్వారా ఎప్పటికీ రన్ చేయవద్దని సలహా ఇస్తుంటారు. ఇది సర్క్యూట్‌పై భారం పడవచ్చు. వేడెక్కడం, షార్ట్ సర్క్యూట్ లేదా అగ్ని ప్రమాదాలకు కారణం కావచ్చు.

Tags:    

Similar News