Humidity Control: తేమ, ఉక్కపోతలతో సతమతమవుతున్నారా.. ఏసీతో పనిలేకుండా.. ఈ పోర్టబుల్ ప్రోడక్ట్‌లతో ఉపయోగిస్తే చాలు..!

Humidity Control: వర్షాకాలం ప్రారంభం కాగానే ప్రజలకు తేమ సమస్య కూడా తలెత్తుతుంది. ఈ సమస్య కారణంగా వర్షాలు కురిసినా ఇళ్లల్లో వేడిగాలులు వీస్తున్నాయి. ఈ వేడిని ఎదుర్కోవడంలో ఫ్యాన్లు, కూలర్లు పూర్తిగా విఫలమవుతాయి.

Update: 2023-07-10 15:00 GMT

Humidity Control: తేమ, ఉక్కపోతలతో సతమతమవుతున్నారా.. ఏసీతో పనిలేకుండా.. ఈ పోర్టబుల్ ప్రోడక్ట్‌లతో ఉపయోగిస్తే చాలు..!

Moisture Control: వర్షాకాలం ప్రారంభం కాగానే ప్రజలకు తేమ సమస్య కూడా తలెత్తుతుంది. ఈ సమస్య కారణంగా వర్షాలు కురిసినా ఇళ్లల్లో వేడిగాలులు వీస్తున్నాయి. ఈ వేడిని ఎదుర్కోవడంలో ఫ్యాన్లు, కూలర్లు పూర్తిగా విఫలమవుతాయి. అయితే, ఈ సమస్యను సులభంగా నివారించవచ్చు. అది కూడా ఎయిర్ కండీషనర్ లాగా కనిపించే ప్రత్యేక రకం పరికరం సహాయంతో తేమను నివారించవచ్చు. ఈ ప్రొడక్ట్ గురించి మీరు తప్పక తెలుసుకోవాల్సిందే. దాని ఫీచర్లు, ధర ఎంతో తెలుసుకుందాం..

పోర్టబుల్ మినీ డీహ్యూమిడిఫైయర్ మాయిశ్చర్ అబ్జార్బర్‌..

అమెజాన్ నుంచి రూ.1399కే ఈ పోర్టబుల్ మినీ డీహ్యూమిడిఫైయర్ మాయిశ్చర్ అబ్జార్బర్‌ని కొనుగోలు చేయవచ్చు. ఇది 1 లీటర్ మినీ డీహ్యూమిడిఫైయర్. మీరు దీన్ని ఇంట్లో సులభంగా ఉపయోగించవచ్చు. ఇందులో మీరు 400 గ్రాముల కాల్షియం క్లోరైడ్ రీఫిల్ ప్యాక్‌ని కూడా పొందుతున్నారు. దీని కొలతలు 17.5×17.5×21.5 సెం.మీలుగా ఉన్నాయి.

ఎవా-డ్రై E-333 డీహ్యూమిడిఫైయర్..

Eva-Dry E-333 డీహ్యూమిడిఫైయర్ అనేది 1.7KG కెపాసిటీ కలిగిన డీహ్యూమిడిఫైయర్. ఇది తేమను ఆకర్షిస్తుంది. వేడి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. ఇది ఇంట్లో ఎక్కడైనా గోడకు అమర్చవచ్చు. అమెజాన్ నుంచి రూ.2,864కి కొనుగోలు చేయవచ్చు.

ఇంటి కోసం పోస్డ్రీ డీహ్యూమిడిఫైయర్స్..

అమెజాన్ నుంచి రూ.10,513కి పోస్డ్రీ డీహ్యూమిడిఫైయర్‌లను కొనుగోలు చేయవచ్చు. విశేషమేమిటంటే దీని కెపాసిటీ 800మి.లీ.లు మాత్రమే. అల్ట్రా క్వైట్ డీహ్యూమిడిఫైయర్ పనిచేస్తున్నప్పుడు శబ్దం చేయదు. ఇంట్లో ఉపయోగించడానికి ఇది ఉత్తమ ఎంపికగా నిలుస్తుంది.

Tags:    

Similar News