iPhone SE: బడ్జెట్ మార్కెట్‌పై కన్నేసి ఆపిల్.. త్వరలో తక్కువ ధరకే ఫోన్ లాంచ్!

iPhone SE: ఆపిల్ ఐఫోన్ SE, ఐప్యాడ్‌లు, మాక్ బుక్‌లను అప్‌గ్రేడ్ చేయనుంది. వీటిని బడ్జెట్ సెగ్మెంట్‌లో అందుబాటులోకి తీసుకురానుంది.

Update: 2024-10-02 10:08 GMT

iPhone SE

iPhone SE: టెక్ దిగ్గజం ఆపిల్ మార్కెట్‌లో సంచలనం  సృష్టించడానికి సిద్దమవుతోంది. త్వరలోఅప్‌డేట్ చేయబడిన ఐప్యాడ్‌లు, మాక్ కంప్యూటర్‌లతో పాటుగా 2025లో రీ డిజైన్ చేసిన iPhone SEని విడుదల చేయడానికి  సన్నాహాలు చేస్తోంది. రాబోయే ఐఫోన్ SE ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుందని భావిస్తున్నారు. అలానే ఇందులో ఎప్పటి నుంచో వస్తున్న హోమ్ బటన్ రిమూవ్ చేసే అవకాశం ఉంది. ఈ ఛేంజస్‌తో ఆపిల్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో తన ఆఫర్‌ను మెరుగుపరచాలని లక్ష్యంగా పెట్టుకుంది.

బ్లూమ్‌బెర్గ్, మార్క్ గుర్మాన్ నివేదిక ప్రకారం.. ఆపిల్ కొత్త ఐఫోన్ SE, రిఫ్రెష్ చేసిన ఐప్యాడ్‌లు, అప్‌డేట్ చేసిన Mac కంప్యూటర్‌లతో సహా అనేక కొత్త గ్యాడ్జెట్లను ప్రారంభించేందుకు సిద్ధమవుతోంది. ఆపిల్ బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్‌  iPhone SE 2022 నుండి అప్‌గ్రేడ్ చేయలేదు. తక్కువ ధర స్మార్ట్‌ఫోన్ సెగ్మెంట్‌లో పోటీ తీవ్రతరం కావడంతో Apple తన సరసమైన మోడల్‌ను రీ డిజైన్‌పై దృష్టి సారిస్తోంది. అదే సమయంలో కొత్త iPadలు,  Mac అప్‌గ్రేడ్‌లపై కూడా పని చేస్తోంది.

రాబోయే iPhone SEలో చాలా పెద్ద మార్పులు చేయబోతుంది. ముఖ్యంగా హోమ్ బటన్‌ను తీసివేయడం. ఇది SE లైన్ పెద్ద ఛేంజ్ కానుంది. కొత్త మోడల్ ఐఫోన్ 14లో కనిపించే విధంగా ఎడ్జ్-టు-ఎడ్జ్ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా, ఇతర సెన్సార్‌లను ఉంచడానికి పైభాగంలో నాచ్‌ ఉంటుంది. ఇది ఆపిల్ ప్రీమియం మొబైల్స్ ఉపయోగించిన ఫీల్ అందిస్తోంది. 

అదనంగా కొత్త iPhone SE ఆపిల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్ ఇస్తుంది.  ఈ ఫీచర్లు iPhone 16, ఇతర ఫ్లాగ్‌షిప్ మోడల్‌లతో కూడా ఉండనున్నాయి. ఈ ఫీచర్లు సరసమైన ధరలో ఆధునిక ఫీచర్లను కోరుకునే వారికి SEని మరింత ఆకర్షణీయంగా చేస్తాయి. ఫ్లాగ్‌షిప్ ధర ట్యాగ్ లేకుండా ప్రీమియం అనుభవాన్ని అందిస్తాయి.

ఈ మార్పులు బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో మరింత ప్రభావవంతంగా పోటీ పడటానికి ఆపిల్ వ్యూహంలో భాగం. ముఖ్యంగా చైనా వంటి ప్రాంతాలలో Huawei, Xiaomi ఆండ్రాయిడ్ డివైజ్‌లను గట్టీ సవాల్ విసరనుంది. ప్రస్తుత డిజైన్, అప్‌డేట్ చేయబడిన ఫీచర్లతో ఆపిల్ తన ప్రత్యర్థులకు కోల్పోయిన మార్కెట్ వాటాలో కొంత భాగాన్ని తిరిగి పొందాలని భావిస్తోంది. Apple కొత్త iPhone SE, అప్‌డేట్ చేయబడిన iPadలను 2025 ప్రారంభంలో మార్కెట్‌లో పరిచయం చేయనుంది. వీటిని నబంబర్‌లో జరిగే ఆపిల్ ఈవెంట్‌లో చూడొచ్చు. 

Tags:    

Similar News