Amazon: రూ. 14వేలకే కర్వ్డ్‌ డిస్‌ప్లే ఫోన్‌.. అమెజాన్‌ సేల్‌లో అదిరే ఆఫర్‌..

Amazon: రూ. 14వేలకే కర్వ్డ్‌ డిస్‌ప్లే ఫోన్‌.. అమెజాన్‌ సేల్‌లో అదిరే ఆఫర్‌..

Update: 2024-08-06 15:29 GMT

Amazon: రూ. 14వేలకే కర్వ్డ్‌ డిస్‌ప్లే ఫోన్‌.. అమెజాన్‌ సేల్‌లో అదిరే ఆఫర్‌.. 

Amazon: ప్రముఖ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ గ్రేట్ ఫ్రీడమ్‌ ఫెస్టివల్ సేల్‌ పేరుతో సేల్ నిర్వహిస్తున్న విషయం తెలిసిదే. ఇప్పటికే ప్రారంభమైన ఈ సేల్ ఆగస్టు 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ సేల్‌ను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఎలక్ట్రానిక్‌ గ్యాడ్జెట్స్‌ మొదలు, గృహోపకరణాల వరకు అన్ని రకాల గ్యాడ్జెట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తున్నారు. మరీ ముఖ్యంగా స్మార్ట్‌ ఫోన్స్‌పై ఈ సేల్ భాగంగా ఊహకందని డిస్కౌంట్స్‌ను ఇస్తున్నారు. ఇలాంటి ఓ బెస్ట్‌ డీల్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

భారత్‌కు చెందిన ప్రముఖ స్మార్ట ఫోన్‌తయారీ కంపెనీ లావా ఇటీవల మార్కెట్లోకి లావా బ్లేజ్‌ ఎక్స్‌ పేరుతో ఓ ఫోన్‌ను తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తక్కువ ధరలో మంచి ఫీచర్లతో ఈ ఫోన్‌ను తీసుకురావడం విశేషం. అయితే తాజాగా ఈ ఫోన్‌పై అమెజాన్‌సేలలో భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ అసలు ధర రూ. 16,999గా ఉండగా ప్రస్తుతం 12 శాతం డిస్కౌంట్‌తో రూ. 14,999కే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు. అయితే తాజాగా అమెజాన్‌ సేల్‌లో భాగంగా ఈ ఫోన్‌ను రూ. 13,999కే పొందొచ్చు. అన్ని రకాల ఆఫర్లను కలుపుకొని ఈ ఫోన్‌ను తక్కువ ధరకే సొంతం చేసుకునే అవకాశం కల్పించారు.

ఇదిలా ఉంటే లావా బ్లేజ్‌ ఎక్స్‌ 5జీ స్మార్ట్ ఫోన్‌ ఫీచర్ల విషయానికొస్తే ఇందులో.. 6.67 ఇంచెస్‌తో కూడిన 120 హెచ్‌జెడ్‌ కర్వ్డ్‌ అమోఎల్‌ఈడీ డస్‌ప్లేను అందించారు. ఈ ఫోన్‌లో డీఆర్‌ఎమ్‌ ప్రొటెక్షనను ఇచ్చారు.దీంతో ఈ స్క్రీన్‌లో హై రిజల్యూషన్‌ వీడియోలను వీక్షించవచ్చు. కెమెరా విషయానికొస్తే ఈ స్మార్ట్ ఫోన్‌లో 64 మెగాపికల్సెత్స్‌తో కూడిన రెయిర్ కెమెరాను ఇచ్చారు. అలాగే సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం ఇందులో 16 ఎంపీతో కూడిన ఫ్రంట్ కెమెరాను ఇచ్చారు. ఈ ఫోన్‌ ఆక్టాకోర్‌ 2.4 జీహెచ్‌జెడ్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6300 6ఎన్‌ఎమ్‌ ప్రాసెసర్‌ను అందించారు.

ఇక ఈ ఫోన్‌లో 33 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జర్‌కు సపోర్ట్ చేసే బ్యాటరీని అందించారు. ఆండ్రాయిడ్‌ 14 ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో ఇన్‌ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్ సెన్సర్‌ను అందించారు. కనెక్టివిటీ విషయానికొస్తే ఇందులో వైఫై6, బ్లూటూత్‌ 5.3, జీఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌ఎఫ్‌సీ, జీపీఎస్‌, యూఎస్‌బీ, 2.4జీ, 5జీ వంటి కనెక్టివిటీ ఫీచర్లను అందించారు.

Tags:    

Similar News