డ్రైవర్లందరికి అలర్ట్‌.. ఆ లైసెన్స్‌కి సంబంధించి ఆఖరు తేదీ వచ్చేసింది..!

Driving Licence: మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఈ వార్త మీ కోసమే...

Update: 2022-03-12 01:16 GMT

డ్రైవర్లందరికి అలర్ట్‌.. ఆ లైసెన్స్‌కి సంబంధించి ఆఖరు తేదీ వచ్చేసింది..!

Driving Licence: మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే ఈ వార్త మీ కోసమే. వాస్తవానికి చేతితో రూపొందించిన పాత డ్రైవింగ్ లైసెన్స్‌ను ప్రభుత్వం ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి మారుస్తోంది. ఈ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు మార్చి 12 వరకు ఆన్‌లైన్‌లో మార్చుకోవచ్చు. రవాణా శాఖ తరపున చేతితో రాసి ఉన్న అలాంటి డ్రైవింగ్ లైసెన్స్‌లను (డిఎల్) అధికారులు ఆన్‌లైన్‌లోకి మారుస్తున్నారు. ఇలాంటి డీఎల్‌లను ఆన్‌లైన్‌లో చేసుకునేందుకు ప్రభుత్వం మార్చి 12 వరకు అవకాశం కల్పించింది.

మార్చి 12 తర్వాత అవకాశం ఉండదు

రవాణా శాఖ ప్రకారం.. బ్యాక్‌లాక్ ఎంట్రీ మార్చి 12 వరకు సారథి పోర్టల్ (www.parivahan.gov.in ) ద్వారా అందుబాటులో ఉంటుంది. ఆ తర్వాత చేతితో రాసిన డీల్ ఆన్‌లైన్‌లో నమోదు చేయడం సాధ్యం కాదు. మీడియా నివేదికల ప్రకారం.. DL బుక్‌లెట్ లేదా చేతితో రాసిన డ్రైవింగ్ లైసెన్స్‌లన్నీ ఇప్పుడు ఆన్‌లైన్‌లోకి మారుస్తున్నారు. మీ వద్ద చేతితో రాసిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉంటే మార్చి 12 సాయంత్రం 4 గంటలలోపు జిల్లా రవాణా కార్యాలయాల్లో (RTO కార్యాలయం) ఒరిజినల్ లైసెన్స్‌తో ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి. ఈ మేరకు రాష్ట్రంలోని అన్ని ఆర్టీఓలకు రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

చేతితో రాసిన డీఎల్‌ని మెయింటెయిన్ చేయడం చాలా ఇబ్బంది. ఇది తడిగా మారడం, పగిలిపోవడం లేదా పాడైపోయే ప్రమాదం ఉంటుంది. చిప్‌తో కూడిన డ్రైవింగ్‌ లైసెన్స్‌ దీని కంటే చాలా సులభం. అలాగే తనిఖీ సమయంలో ఎలాంటి అనుమానం ఉండదు. ఆన్‌లైన్‌లోకి మార్చిన తర్వాత డ్రైవింగ్‌ లైసెన్స్‌ పూర్తి సమాచారం సారథి వెబ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. ఇలాంటి డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉన్నవారు వెంటనే ఆర్టీవో ఆఫీసు కార్యాలయాలకి వెళ్లండి.

Tags:    

Similar News