Cyber Fraud: ఆఫర్ల పేరుతో బురిడి కొట్టిస్తారు జాగ్రత్త.. సైబర్ మోసగాళ్లు పొంచి ఉన్నారు
Cyber Fraud: చెక్‌పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ అమెజాన్ సేల్ సమయంలో సైబర్ నేరగాళ్లు అమెజాన్ యూజర్లను టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు.
Cyber Fraud: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ ఇటీవల అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేరుతో ఓ సేల్‌ను ప్రారంభించేందుకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నెల 20, 21వ తేదీల్లో ఈ సేల్‌ను ప్రారంభించనుంది. ఇందులో భాగంగా పలు ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్‌తో పాటు ఇతర ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నారు. అయితే దీనినే అనువుగా మార్చుకొని కొందరు నేరస్థులు ప్రజలను దోచుకోవడానికి సిద్ధమవుతున్నారు. నకిలీ వెబ్‌సైట్ ద్వారా ప్రజలను నిండా ముంచేయననున్నారు.
అమెజాన్ ప్రైమ్ డే సేల్‌కు సంబంధించి ఒక నివేదిక ప్రస్తుతం వెలుగులోకి వచ్చింది. చెక్‌పాయింట్ రీసెర్చ్ అనే సంస్థ అమెజాన్ సేల్ సమయంలో సైబర్ నేరగాళ్లు అమెజాన్ యూజర్లను టార్గెట్ చేసుకునే అవకాశం ఉందని చెబుతున్నారు. ఇందుకోసం సైబర్ నేరస్థులు అమెజాన్‌ను పోలిన నకిలీ వెబ్‌సైట్స్‌ను సృష్టిస్తున్నారు. దీంతో యూజర్లు ఈ సైట్‌లో డబ్బులు చెల్లించి మోసపోతారని నిపుణులు చెబుతున్నారు.
ఇందులో భాగంగా సైబర్ నేరస్థులు అమెజాన్ ప్రైమ్ డే సేల్ పేరుతో కొన్ని ప్రొడక్ట్స్‌పై భారీ డిస్కౌంట్స్‌ను అందిస్తూ.. కొన్ని లింక్స్‌ను క్రియేట్ చేస్తారు. వీటిని సోషల్ మీడియాతోపాటు, వాట్సాప్ గ్రూప్స్‌లో వైరల్ చేస్తారు. వెనకా ముందు చూసుకోకుండా ఈ లింక్స్ ఓపెన్ చేసి ప్రొడక్ట్స్ కొనుగోలు చేసే ఇక మీ పని అంతే. డబ్బులు సైబర్ నేరస్థులు చేతుల్లో పెట్టేసినట్లే. అచ్చంగా ఒరిజినల్ వెబ్‌సైట్స్‌ను పోలి ఉన్నట్లే వీటిని డిజైన్ చేస్తారు.
అలాగే ఈ లింక్స్ ద్వారా ల్యాప్‌టాప్స్‌లోకి, మొబైల్ ఫోన్స్‌లోకి వైరస్‌లను జొప్పించి, హ్యాక్ చేసే అవకాశాలు ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. అందుకే ఆన్‌లైన్‌లో షాపింగ్ చేసే సమయంలో యూఆర్‌ఎల్ను గమనించాలని చెబుతున్నారు. యూఆర్‌ఎల్‌లో ఏవైనా స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటే వాటి జోల్లికి వెళ్లకూడదని చెబుతున్నారు. అలాగే వీలైనంత వరకు లింక్స్ ద్వారా కాకుండా అమెజాన్ ఒరిజినల్ యాప్ లేదా వెబ్‌సైట్ నుంచే ప్రొడెక్ట్స్‌ను కొనుగోలు చేయాలి. లింక్స్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌ను, వాటి ఆఫర్లను ఒరిజినల్ వెబ్‌సైట్‌లో ఉన్న ప్రొడక్ట్స్‌తో పోల్చి చూసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు.