Smart Phone: మీ ఫోన్‌లో గ్రీన్ లైట్‌ కనిపిస్తుందా.. డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. వెంటనే ఇలా చేయండి..!

Screen Recording: ప్రస్తుతం ఫోన్ ప్రతి ఒక్కరికీ అవసరం. చిన్నా పెద్దా ప్రతి విషయానికి ఫోన్‌పై ఆధారపడుతున్నారు. అది బ్యాంకు సంబంధించిన పని అయినా, అధికారిక పత్రాలను దాచుకోవడం లాంటివి కూడా కేవలం ఒక ట్యాప్‌తో పూర్తవుతాయి.

Update: 2023-08-23 15:30 GMT

Smart Phone: మీ ఫోన్‌లో గ్రీన్ లైట్‌ కనిపిస్తుందా.. డేంజర్ జోన్‌లో పడ్డట్లే.. వెంటనే ఇలా చేయండి..!

Hacking: ప్రస్తుతం ఫోన్ ప్రతి ఒక్కరికీ అవసరం. చిన్నా పెద్దా ప్రతి విషయానికి ఫోన్‌పై ఆధారపడుతున్నారు. అది బ్యాంకు సంబంధించిన పని అయినా, అధికారిక పత్రాలను దాచుకోవడం లాంటివి కూడా కేవలం ఒక ట్యాప్‌తో పూర్తవుతాయి. ఇతరులతో మాట్లాడటానికి, అద్భుతమైన ఫొటోలు తీయడానికి కూడా ఫోన్ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా చాలా పర్సనల్ ఫొటోలతో, మరెన్నో కీలక విషయాలు ఫోన్‌లో సేఫ్‌గా దాచుకుంటుంటారు. అందుకే ఫోన్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం చాలా ముఖ్యం.

హ్యాకింగ్ వార్తలు వినగానే చాలామంది భయపడుతుంటారు. ఎందుకంటే ఫోన్ హ్యాక్ అయితే, పర్సనల్ ఫొటోలు, కాల్ రికార్డింగ్స్, వీడియోలు ఇలా ఎన్నో లీకైపోతుంటాయి. అందుకే ఫోన్ విషయంలో ఎప్పుడూ అప్రమత్తంగా ఉండటం చాలా అవసరం.

ప్రస్తుతం హ్యాకర్లు మీ స్క్రీన్‌ను రహస్యంగా రికార్డ్ చేసే కొత్త హ్యాకింగ్ మార్గం బయటకు వస్తోంది. ఇబ్బందికరమైన విషయం ఏమిటంటే, మీ స్క్రీన్ రికార్డ్ అవుతున్నప్పుడు, వినియోగదారులకు కూడా తెలియకుండా ఫోన్ స్క్రీన్ రికార్డింగ్ చేస్తుంటారు. ఈ క్రమంలో మోసగాళ్ళు డేటాను దొంగిలించి దానితో బెదిరిస్తుంటారు.

గ్రీన్ లైట్ కనిపిస్తుందా..

బ్యాంక్ వివరాలు ప్రమాదంలో ఉన్నట్లయితే, మీరు చాలా కాలం పాటు ఇబ్బందులు పడే ఛాన్స్ ఉంటుంది. ఇటువంటి పరిస్థితిలో, ఎవరైనా మన ఫోన్ స్క్రీన్‌ను రికార్డ్ చేస్తున్నారని ఎలా తెలుసుకోవాలనే ప్రశ్న తలెత్తుతుంది. కనుక్కోవడం అంత సులభం కాదు. కానీ, కొన్ని ఫోన్‌లలో ప్రత్యేకమైన ఫీచర్లు ఉన్నాయి. దీని కారణంగా మీ కెమెరా లేదా మైక్ ఉపయోగించినట్లయితే, గ్రీన్ కలర్ లైట్ బర్నింగ్ ప్రారంభమవుతుంది.

అవును, ఈ ఫీచర్ చాలా ఫోన్లలో అందుబాటులో ఉంది. ఫీచర్ కింద, మీ ఫోన్ మైక్ లేదా కెమెరా బ్యాక్‌గ్రౌండ్‌లో ఉపయోగించబడుతుంటే, దాని స్క్రీన్‌పై గ్రీన్ డాట్ లైట్ కనిపిస్తుంది. మీ ఫోన్‌లో స్క్రీన్ రికార్డ్ అవుతుంటే లేదా కెమెరా ఉపయోగించబడుతుంటే, మీరు ఫోన్‌కు కుడి వైపున గ్రీన్ లైట్‌ కనిపిస్తుంది.

ఎలా ఆపాలి?

స్క్రీన్ రికార్డింగ్ యాప్ ద్వారా జరుగుతుంటే, ముందుగా ఏ యాప్ నుంచి రికార్డింగ్ జరుగుతుందో చూడండి. ఆ యాప్‌ని గుర్తించిన వెంటనే తొలగించండి. రెండో మార్గం ఏంటంటే.. మీ ఫోన్ హ్యాకర్స్ రాడార్‌పైకి వచ్చిందా అనే చిన్న సందేహం కూడా ఉంటే, మీరు పెద్దగా ఆలోచించకుండా వెంటనే ఫోన్‌ని రీసెట్ చేయాలి.

Tags:    

Similar News