ZIM vs IND: తొలి మ్యాచ్‌లో జీరో.. రెండో మ్యాచ్‌లో సెంచరీ.. జింబాబ్వేలో అభిషేక్ శర్మ రికార్డుల ఊచకోత..

Abhishek Sharma Century: ఆదివారం హరారేలో జింబాబ్వేతో జరుగుతోన్న రెండో టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 46 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తొలి టీ20లో అరంగేట్రం చేసిన ఈ యువ ప్లేయర్.. డకౌట్‌గా వెనుదిరిగి చెత్త రికార్డ్ నమోదు చేశాడు.

Update: 2024-07-07 12:20 GMT

Abhishek Sharma Century: ఆదివారం హరారేలో జింబాబ్వేతో జరుగుతోన్న రెండో టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ 46 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. తొలి టీ20లో అరంగేట్రం చేసిన ఈ యువ ప్లేయర్.. డకౌట్‌గా వెనుదిరిగి చెత్త రికార్డ్ నమోదు చేశాడు. ఇక నేడు రెండో టీ20లోనే సెంచరీతో మరోసారి తన పేరుతో అద్భుతమైన రికార్డ్ నమోదు చేశాడు. ఈ క్రమంలో అభిషేక్ 7 ఫోర్లు, 8 సిక్సర్లు బాదాడు.

3 వరుస సిక్సర్లతో అభిషేక్ సెంచరీ.. ఆ తర్వాతి బంతికి ఔట్..

14వ ఓవర్లో అభిషేక్ శర్మ సెంచరీ పూర్తి చేశాడు. వరుసగా మూడు సిక్సర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అభిషేక్ 46 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. జింబాబ్వేపై సెంచరీ చేసిన తొలి భారతీయుడిగా నిలిచాడు. అయితే ఆ ఓవర్ చివరి బంతికి అభిషేక్ ఔటయ్యాడు.

రికార్డ్ భాగస్వామ్యం..

జింబాబ్వేపై అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ భారత అత్యధిక భాగస్వామ్యం నమోదు చేశారు. వీరిద్దరూ కేఎల్ రాహుల్, మన్‌దీప్ సింగ్‌ల 102 పరుగుల భాగస్వామ్య రికార్డును బద్దలు కొట్టారు. రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి 76 బంతుల్లో 137 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. జింబాబ్వేపై భారత్‌కు ఇదే అత్యధిక భాగస్వామ్యం.

సిక్సర్‌తోనే పరుగుల ఖాతా తెలిచిన్ అభిషేక్..

మ్యాచ్ తొలి ఓవర్‌లో భారత జట్టు 10 పరుగులు చేసింది. బ్రియాన్ బెన్నెట్ వేసిన ఓవర్ రెండో బంతికి అభిషేక్ శర్మ సిక్సర్ కొట్టి అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఖాతా తెరిచాడు.

వార్తలు రాసే సమయానికి భారత జట్టు 17 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 177 పరుగులు చేసింది. క్రీజులో రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్ ఉన్నారు. గైక్వాడ్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 38 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు.

ఇరుజట్ల ప్లేయింగ్ 11..

భారత్: శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), అభిషేక్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, ధ్రువ్ జురెల్, (వికెట్ కీపర్), సాయి సుదర్శన్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అవేష్ ఖాన్, ముఖేష్ కుమార్.

జింబాబ్వే: అలెగ్జాండర్ రజా (కెప్టెన్), కైయా ఇన్నోసెంట్, డియోన్ మైయర్స్, వెస్లీ మాధేవర్, బ్రియాన్ బెన్నెట్, క్యాంప్‌బెల్ జొనాథన్, టెండై చటారా, ల్యూక్ జోంగ్వే, వెల్లింగ్టన్ మసకద్జా, బ్రాండన్మవుతా, ముజరబానీ బ్లెస్సింగ్.

Tags:    

Similar News