Women's T20 World Cup 2024: ఐసీసీ మహిళల T20 వరల్డ్ కప్ కొత్త షెడ్యూల్ ఇదే..భారత్-పాక్ మధ్య మ్యాచ్ ఎప్పుడంటే?
Women's T20 World Cup 2024:ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 సవరించిన షెడ్యూల్ సోమవారం విడుదలైంది. యూఏఈలోని ఏ మైదానంలో ఏ జట్టు ఎప్పుడు మ్యాచ్ ఆడబోతుందో పూర్తి వివరాలను వెల్లడించింది. భారత్-పాక్ మధ్య మ్యాచ్ ఎప్పుడు ఉందో తెలుసుకుందాం.
Women's T20 World Cup 2024: మహిళల టీ20 ప్రపంచకప్ 2024 సవరించిన షెడ్యూల్‌ను సోమవారం ICC ప్రకటించింది. ఈ కొత్త షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 6న దుబాయ్ క్రికెట్ స్టేడియంలో భారత్-పాకిస్థాన్ మధ్య పోరు జరగనుంది. ఈ టోర్నమెంట్ అక్టోబర్ 3 నుండి ప్రారంభమవుతుంది. దాని ఫైనల్ అక్టోబర్ 20న ఉంది.
బంగ్లాదేశ్ మహిళల T20 ప్రపంచ కప్ 2024కి ఆతిథ్యం ఇచ్చిన విషయం తెలిసిందే. అందుకే ఈ టోర్నమెంట్ అక్కడ జరగాల్సి ఉంది. కానీ బంగ్లాదేశ్‌లో కొనసాగుతున్న హింసాత్మక నిరసనల కారణంగా, ఈ టోర్నమెంట్ UAEకి మార్చారు. ఇప్పుడు ఈ ప్రపంచకప్ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు చేశారు.
మహిళల T20 ప్రపంచ కప్ 2024 గ్రూపులు:
గ్రూప్ A: ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక
గ్రూప్ బి: దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, స్కాట్లాండ్
ప్రాక్టీస్ మ్యాచ్‌లు సెప్టెంబర్ 28 నుండి షురూ:
ICC మహిళల T20 ప్రపంచ కప్ 2024 యొక్క 9వ ఎడిషన్ బంగ్లాదేశ్ నుండి UAEకి మార్చిన సంగతి తెలిసిందే. దీనితో ఇప్పుడు అన్ని మ్యాచ్‌లు దుబాయ్, షార్జా స్టేడియంలలో ఆడబోతున్నాయి. ఈ టోర్నీలో మొత్తం 10 జట్లు పాల్గొనబోతున్నాయి. ఈ టోర్నీకి ముందు మొత్తం 10 ప్రాక్టీస్ మ్యాచ్‌లు కూడా జరగనున్నాయి. ప్రతి జట్టు ఆడటానికి ఒక ప్రాక్టీస్ మ్యాచ్ ఉంటుంది. ఈ ప్రాక్టీస్ మ్యాచ్‌లు టోర్నీకి ముందు 28 సెప్టెంబర్ నుండి అక్టోబర్ 1 వరకు జరుగుతాయి.
సెమీ-ఫైనల్ ఫైనల్స్ కోసం రిజర్వ్ డే:
ఈ టోర్నమెంట్‌లో, ప్రతి జట్టు నాలుగు గ్రూప్ మ్యాచ్‌లను ఆడుతుంది. ఇందులో ప్రతి గ్రూప్‌లోని మొదటి రెండు జట్లు అక్టోబర్ 17, 18 తేదీల్లో సెమీ-ఫైనల్‌కు చేరుకుంటాయి. ఆ తర్వాత ఫైనల్ దుబాయ్‌లో జరుగుతుంది. అక్టోబర్ 20వ తేదీన సెమీ-ఫైనల్, ఫైనల్ రెండింటికీ రిజర్వ్ డే నిర్ణయించారు. ఒకవేళ భారత్ సెమీఫైనల్‌కు చేరితే, సెమీఫైనల్ 1లో ఆడుతుంది. దుబాయ్, షార్జాలోని రెండు వేదికలపై 23 మ్యాచ్‌లు జరగనున్నాయి.
మహిళల T20 ప్రపంచ కప్ 2024 కొత్త షెడ్యూల్:
-అక్టోబర్ 3, గురువారం, బంగ్లాదేశ్ vs స్కాట్లాండ్, షార్జా, మధ్యాహ్నం 2 గం
-అక్టోబర్ 3, గురువారం, పాకిస్తాన్ vs శ్రీలంక, షార్జా, సాయంత్రం 6 గం
-అక్టోబర్ 4, శుక్రవారం, దక్షిణాఫ్రికా vs వెస్టిండీస్, దుబాయ్, మధ్యాహ్నం 2 గం
-అక్టోబర్ 4, శుక్రవారం, ఇండియా vs న్యూజిలాండ్, దుబాయ్, సాయంత్రం 6 గం
-అక్టోబర్ 5, శనివారం, బంగ్లాదేశ్ vs ఇంగ్లాండ్, షార్జా, మధ్యాహ్నం 2 గం
-అక్టోబర్ 5, శనివారం, ఆస్ట్రేలియా vs శ్రీలంక, షార్జా, సాయంత్రం 6 గం
-అక్టోబర్ 6, ఆదివారం, భారత్ vs పాకిస్థాన్, దుబాయ్, మధ్యాహ్నం 2గం
-అక్టోబర్ 6, ఆదివారం, వెస్టిండీస్ vs స్కాట్లాండ్, దుబాయ్, 6 PM
-అక్టోబర్ 7, సోమవారం, ఇంగ్లాండ్ vs సౌత్ ఆఫ్రికా, షార్జా, సాయంత్రం 6 గం
-అక్టోబర్ 8, మంగళవారం, ఆస్ట్రేలియా vs న్యూజిలాండ్, షార్జా, సాయంత్రం 6 గం
-అక్టోబర్ 9, బుధవారం, దక్షిణాఫ్రికా vs స్కాట్లాండ్, దుబాయ్, మధ్యాహ్నం 2 గం
-అక్టోబర్ 9, బుధవారం, భారతదేశం vs శ్రీలంక, దుబాయ్, సాయంత్రం 6 గం
-అక్టోబర్ 10, గురువారం, బంగ్లాదేశ్ vs వెస్టిండీస్, షార్జా, సాయంత్రం 6 గం
-అక్టోబర్ 11, శుక్రవారం, ఆస్ట్రేలియా vs పాకిస్తాన్, దుబాయ్, సాయంత్రం 6 గం
-అక్టోబర్ 12, శనివారం, న్యూజిలాండ్ vs శ్రీలంక, షార్జా, మధ్యాహ్నం 2 గం
-అక్టోబర్ 12, శనివారం, బంగ్లాదేశ్ vs దక్షిణాఫ్రికా, దుబాయ్, సాయంత్రం 6 గం
-అక్టోబర్ 13, ఆదివారం, ఇంగ్లాండ్ vs స్కాట్లాండ్, షార్జా, మధ్యాహ్నం 2 గం
-అక్టోబర్ 13, ఆదివారం, ఇండియా vs ఆస్ట్రేలియా, షార్జా, సాయంత్రం 6 గం
-అక్టోబర్ 14, సోమవారం, పాకిస్తాన్ vs న్యూజిలాండ్, దుబాయ్, సాయంత్రం 6 గం
-అక్టోబర్ 15, మంగళవారం, ఇంగ్లాండ్ vs వెస్టిండీస్, దుబాయ్, సాయంత్రం 6 గం
-అక్టోబర్ 17, గురువారం, సెమీ-ఫైనల్ 1, దుబాయ్, 6 PM
-అక్టోబర్ 18, శుక్రవారం, సెమీ-ఫైనల్ 2, షార్జా, సాయంత్రం 6 గంటలకు
-20 అక్టోబర్, ఆదివారం, ఫైనల్, దుబాయ్, సాయంత్రం 6 గం