IPL 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ కు భారీ స్ట్రోక్.. గాయంతో స్టార్ ఆటగాడు టోర్నీ మొత్తానికి దూరం..!
IPL 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది.
IPL 2023: సన్ రైజర్స్ హైదరాబాద్ కు కోలుకోలేని దెబ్బ తగిలింది. కీలక ఆటగాడు వాషింగ్టన్ సుందర్ తొడ కండరాల గాయం కారణంగా ఐపీఎల్ 2023 మ్యాచుల నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ ప్రకటించింది. తొడ కండరాల గాయంతో వాషింగ్టన్ సుందర్ బాధపడుతున్నాడని, అతను సీజన్ మొత్తానికి దూరమయ్యాడని ట్విట్టర్ లో అధికారికంగా అనౌన్స్ చేసింది.
ఫామ్ లోకి వచ్చాడు అని ఫ్యాన్స్ సంబరపడుతున్నవేళ గాయం బారిన పడి జట్టుకు దూరం కావడంతో ఆందోళన కలిగిస్తోంది. ఇది నిజంగానే కోలుకోలేని దెబ్బ ఎందుకంటే లోయర్ ఆర్డర్ బ్యాటింగ్ విషయంలో సన్ రైజర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఇలాంటి కీలక తరుణంలో వాషింగ్టన్ సుందర్ దూరం కావడం సన్ రైజర్స్ టీమ్ కు దురదృష్టమనే చెప్పాలి. ఇప్పటివరకు సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ 7 మ్యాచ్ లు ఆడగా రెండింటిలో మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో టీమ్ 9వ స్థానంలో ఉంది. ఈ టీమ్ ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించాలంటే రన్ రేట్ మెయింటేన్ చేస్తూ 5 మ్యాచులు గెలవాల్సి ఉంది.
వాషింగ్టన్ సుందర్ ను సన్ రైజర్స్ ఫ్రాంచైజీ యజమానులు రూ.8.75 కోట్ల ధరకు కొనుగోలు చేశారు. కానీ అతను గాయం కారణంగా దూరం కావడం..అతన్ని రీప్లేస్ చేసే ఆటగాడు లేకపోవడం సన్ రైజర్స్ ను కలవరపెడుతోంది. మరి, రాబోయే రోజుల్లో ఈ టీమ్ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూడాలి.