VVS Laxman: న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ లో భాగంగా తొలి టెస్ట్ మ్యాచ్ కు కెప్టెన్ గా వ్యవహరిస్తున్న అజింక్య రహనే ఫామ్ పై గత కొంతకాలంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే.. అయితే విరాట్ కోహ్లి రెండో టెస్ట్ కి అందుబాటులో వస్తుండగా రహనే తుది జట్టులో స్థానం సంపాదిస్తాడో లేదోనని వస్తున్న వార్తలపై భారత మాజీ ఆటగాడు వివిఎస్ లక్ష్మన్ తాజాగా స్పందించాడు. విరాట్ కోహ్లి రాకతో శ్రేయాస్ అయ్యర్ ని పక్కన పెట్టె అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని, మొదటి నుండి విరాట్ కోహ్లి సీనియర్ ఆటగాడైన అజింక్య రహనేకి సపోర్ట్ చేస్తూనే ఉన్నాడని.. రెండో టెస్ట్ మ్యాచ్ లోనూ అదే జరుగుతుందని లక్ష్మన్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇప్పటికే న్యూజిలాండ్ తో జరిగిన తొలి టెస్ట్ తో టెస్ట్ క్రికెట్ లో అరంగేట్రం చేసిన శ్రేయాస్ అయ్యర్ మొదటి మ్యాచ్ లోనే సెంచరీతో అభిమానులను ఆకట్టుకున్నాడు. అయితే అద్భుత ఫామ్ లో ఉన్న శ్రేయాస్ అయ్యర్ ని పక్కనపెట్టి.. తన బ్యాటింగ్ లో నిలకడలేక సతమతమవుతున్న అజింక్య రహనేకి మరోసారి అవకాశం ఇస్తాడో చూడాలి.. గత కొంతకాలంగా బ్యాటింగ్ లో విఫలమైన జట్టులో వైస్ కెప్టెన్ గా కొనసాగడం వెనుక రవిశాస్త్రి, విరాట్ కోహ్లి అండదండలు ఉన్నాయనేది ఓపెన్ సీక్రెట్. అజింక్య రహనే గురించి ఇటీవల మాజీ ఆటగాడు గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ రహనేకి ఆట కన్నా అదృష్టం ఎక్కువగా ఉండటం వల్లే ఇప్పటికి జట్టులో కొనసాగుతున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశాడు.