Virat Kohli: ఈ ఓటమి మాకు గుణపాఠం..వరుణ్ బౌలింగ్ డగౌట్ నుండి ఎంజాయ్ చేశా

* కలకత్తా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు ఘోర పరాజయం పాలయింది.

Update: 2021-09-21 08:21 GMT

విరాట్ కోహ్లీ (ట్విట్టర్ ఫోటో)

Virat Kohli: కలకత్తా నైట్ రైడర్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు మధ్య సోమవారం జరిగిన మ్యాచ్ లో బెంగుళూరు ఘోర పరాజయం పాలయింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగుళూరు జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి.. ఓపెనర్ గా దేవ్ దత్ పడిక్కల్ తో మ్యాచ్ ప్రారంభించిన కాసేపటికే విరాట్ 5 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ప్రసిద్ బౌలింగ్ లో ఎల్బిడబ్యు గా వెనుతిరిగాడు. ఆ తరువాత భరత్, పడిక్కల్ లు కలిసి 31 పరుగుల భాగసౌమ్యం అందించిన తరువాత పడిక్కల్ ఫెర్గూసన్ బౌలింగ్ లో ఔటై పెవిలియన్ చేరాడు. ఇక కేవలం 25 పరుగుల వ్యవధిలోనే 5 వికెట్స్ కోల్పోవడంతో చివరికి బెంగుళూరు జట్టు 92 పరుగులకు ఆలౌట్ అయింది.

ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన కలకత్తా నైట్ రైడర్స్ జట్టు ఓపెనర్లు శుభ్ మన్ గిల్, వెంకటేష్ అయ్యర్ ల బ్యాటింగ్ దాటికి నైట్ రైడర్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లతో మంచి ఫామ్ లో కనిపించాడు. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన విరాట్ కోహ్లి.. ఈ ఓటమి తమకు గుణపాఠం లాంటిందని ఈ మ్యాచ్ లో బ్యాటింగ్ లో పూర్తిగా విఫలమయ్యమని, తమ తప్పిదాలను తెలుసుకొని తరువాత మ్యాచ్ లలో అలాంటివి తిరిగి జరగకుండా చూసుకుంటామని కోహ్లి తెలిపాడు.

ఇక వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో రాణించడం శుభపరిణామం అంటూనే త్వరలో జరగబోయే టీ20 ప్రపంచకప్ లో వరుణ్ భారత జట్టు బౌలింగ్ లో కీలకపాత్ర పోషిస్తాడని, సోమవారం జరిగిన మ్యాచ్ లో తన బౌలింగ్ ని డగౌట్ నుండి ఎంజాయ్ చేశానని విరాట్ చెప్పుకొచ్చాడు. మంగళవారం పంజాబ్ కింగ్స్ తో రాజస్తాన్ రాయల్స్ జట్టు తలపడనుంది.  

Tags:    

Similar News