Virat Kohli: ఆటలోనే కాదు ఆర్జనలోనూ ధిట్ట కోహ్లీ

Virat Kohli: ఇన్ స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ లో టాప్-20లో నమోదైన ఏకైక క్రికెటర్ విరాల్ కోహ్లీ మాత్రమే.

Update: 2021-07-02 09:48 GMT

Team India Captain Virat Kohli

Virat Kohli: కొడితే కొట్టాలిరా సిక్స్ కొట్టాలి అనే ఫార్ములాను ఆటలోనే కాదు.. సంపాదనలోనూ ఫాలో అయిపోతున్నాడు విరాట్ కొహ్లీ. ఎలాంటి బాల్ నైనా కొట్టగల కొహ్లీ... ఎలాంటి ప్లాట్ ఫాంలోనైనా డబ్బులు లాగడంలో ఎక్స్ పర్ట్ అయిపోయాడు. అలా ఇలా కాదు.. ఏకంగా ప్రపంచంలోనే టాప్ 20లోకి వెళ్లిపోయాడు. అది కూడా ఇన్ స్టాగ్రామ్ సంపాదనలో.. ఆశ్చర్యంగా ఉందా.. నిజమే. కొహ్లీ ఇన్ స్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేశాడంటే.. ఊరికే చేయడు.. అది రికార్డులు బద్దలు కొట్టి.. మనోడికి కాసులు కురిపించేలా చేస్తాడు. ప్రపంచ వ్యవాప్తంగా ఇన్ స్టాగ్రామ్లో ఎక్కువ ఆర్జిస్తున్న వారిలో టాప్-20లో నిలిచాడు. ఇన్ స్టాలో ఒక పోస్టుకు అతడు రూ.5 కోట్ల వరకు తీసుకుంటున్నాడని తెలిపింది.

హాపర్ హెచ్ క్యూ 2021 అనే సంస్థ ఈ మధ్యే ఇన్ స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ పేరుతో ఒక జాబితా విడుదల చేసింది. ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ద్వారా ప్రపంచలో ఎక్కువగా ఆర్జిస్తున్న ప్రముఖుల పేర్లను వెల్లడించింది. ఇందులో ఫుట్ బాల్ స్టార్ క్రిష్టియానో రోనాల్డో అగ్రస్థానంలో నిలిచాడు. డబ్ల్యూడబ్ల్యూ ఈ ఆటగాడు, హాలీవుడ్ సూపర్ స్టార్ డ్వేన్ జాన్సన్ రెండో స్థానంలో ఉన్నాడు. భారత్ కరెన్సీ ప్రకారం వీరిద్దరూ ఒక్కో పోస్టుకు రూ.11 కోట్లకు పై గా తీసుకుంటున్నాడట. పాప్ సింగర్ అరియానా గ్రాండె మూడో స్థానంలో నిలిచారు.

ఇన్ స్టాగ్రామ్ రిచ్ లిస్ట్ లో టాప్-20లో నమోదైన ఏకైక క్రికెటర్ విరాట్ కోహ్లీ మాత్రమే. 19వ స్థానంలో న్న అతడు ఒక్కో పోస్టుకు రూ.5కోట్ల వరకు తీసుకుంటున్నాడు. ఈ జాబితాలో చోటు దక్కించుకున్న మరో భారతీయ వ్యక్తి ప్రియాంక చోప్రా. 27వ స్థానంలో నిలిచిన ఆమె ఒక పోస్టుకు రూ.3 కోట్ల వరకు తీసుకుంటుందని తెలిసింది. మొత్తం 395 మందితో రూపొందించిన ఈ జాబితాలో టీమ్ ఇండియా నుంచి మరే క్రికెటర్ కు చోటు దక్కలేదు.

Tags:    

Similar News