Varun Chakravarthy: నేను చస్తే బాగుండు అంటూ కామెంట్ చేశారు
* కలకత్తా ఆటగాడు వరుణ్ చక్రవర్తి ఐపీఎల్ 2021లో తనదైన బౌలింగ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు.
Varun Chakravarthy: కలకత్తా నైట్ రైడర్స్ లెగ్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఐపీఎల్ 2021లో తనదైన బౌలింగ్ ప్రదర్శనతో జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. అయితే ఐపీఎల్ జరుగుతున్న సమయంలో మొదటగా వరుణ్ చక్రవర్తికి కరోన సోకడంతో అటు బయోబబుల్ లో ఉన్న ఆటగాళ్ళతో పాటు మిగితా సిబ్బందికి కూడా కరోనా వైరస్ సోకడంతో బిసిసిఐ ఐపీఎల్ 2021 మ్యాచ్ లను అర్ధాంతరంగా నిలిపివేసింది.
అయితే వరుణ్ చక్రవర్తి వల్లనే ఐపీఎల్ 2021 ఆగిపోయిందని అటు సోషల్ మీడియాలో నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తూ మానసికంగా ఎంతో ఇబ్బందిపెట్టారని తాజాగా వరుణ్ చక్రవర్తి అక్టోబర్ 10 ఆదివారం రోజున వరల్డ్ మెంటల్ హెల్త్ డే సందర్భంగా తన మనసులోని బాధని పంచుకున్నాడు. నా కారణంగానే ఐపీఎల్ ని నిలిపివేశారని, నువ్వు చచ్చిన బాగుండేదంటూ నెటిజన్లు కామెంట్లు చేశారని.. ఆ వ్యాఖ్యలు నన్ను తీవ్రంగా కలిచి వేశాయని.. నా మానసిక స్థితి నుండి బయటికి రావడానికి చాలా సమయమే పట్టిందని వరుణ్ చక్రవర్తి చెప్పుకొచ్చాడు.
త్వరలో జరగబోయే ఐసిసి టీ20 వరల్డ్ కప్ 2021 లో భారత జట్టు తరపున ఎంపిక అయిన ఈ ఆటగాడు మోకాలి గాయంతో వరల్డ్ కప్ లో ఆడుతాడో లేదో అన్న అనుమానాలు వ్యక్తమైన బిసిసిఐ మాత్రం తాజాగా భారత తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయకపోవడంతో వరుణ్ చక్రవర్తి వరల్డ్ కప్ కు అందుబాటులో ఉండనున్నట్లు తెలుస్తుంది.