Viral Video: వావ్.. సూపర్ క్యాచ్ పట్టిన సౌతాఫ్రికా ప్లేయర్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..!

Viral Video: దూరంగా వెళ్తున్న బంతిని చూసిన డస్సెన్ గాలిలోకి దూకి ఒంటి చేత్తో క్యాచ్ తీసుకున్నాడు...

Update: 2022-01-04 04:37 GMT

Viral Video: వావ్.. సూపర్ క్యాచ్ పట్టిన సౌతాఫ్రికా ప్లేయర్.. నెట్టింట్లో వైరలవుతోన్న వీడియో..!

Viral Video: జోహన్నెస్‌బర్గ్‌లో భారత్-దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న టెస్ట్ మ్యాచ్‌లో హనుమ విహారి 20 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. కగిసో రబాడ బౌలింగ్‌లో వాన్ డెర్ డ్యూసెన్‌కి క్యాచ్ ఇచ్చాడు. డ్సూస్సెన్ క్యాచ్ పట్టుకున్న తీరుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అతడి అద్భుత క్యాచ్‌కి సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అవుతోంది. భారత్, దక్షిణాఫ్రికా టీంల మధ్య మూడు టెస్టు మ్యాచుల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న రెండో మ్యాచ్‌లో తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ తక్కువ స్కోర్‌కే పరిమితమైంది. 202 పరుగులకే పరిమితమైంది.

జోహన్నెస్‌బర్గ్‌లో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో భారత్‌ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ సమయంలో, అజింక్యా రహానె ఔట్ అయిన తర్వాత, హనుమ విహారి బ్యాటింగ్‌కు వచ్చాడు. 53 బంతుల్లో 20 పరుగులు చేశాడు. దీని తర్వాత కగిసో రబాడ వేసిన బంతికి డస్సెన్ క్యాచ్ పట్టడంతో ఔటయ్యాడు. దూరంగా వెళ్తున్న బంతిని చూసిన డస్సెన్ గాలిలోకి దూకి ఒంటి చేత్తో క్యాచ్ తీసుకున్నాడు. అతను క్యాచ్‌ను చాలా అద్భుతంగా అందుకున్నాడు. దక్షిణాఫ్రికా క్రికెట్ దాని వీడియోను ట్విట్టర్లో షేర్ చేసింది.

డ్యూస్సెన్ క్యాచ్‌కి సోషల్ మీడియాలో చాలా ప్రశంసలు లభిస్తున్నాయి. డ్యూసెన్ పట్టుకున్న వీడియో వైరల్ అవుతోంది. దీనిపై సౌతాఫ్రికా క్రికెట్ జట్టు అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 202 పరుగులకు ఆలౌట్ అయింది. రహానే ఖాతా తెరవకుండానే ఔటయ్యాడు. మయాంక్ అగర్వాల్ 26 పరుగులు చేశాడు. పుజారా కేవలం 3 పరుగులకే పెవిలియన్‌కు చేరుకున్నాడు.

కెప్టెన్ కేఎల్ రాహుల్ చక్కటి ఇన్నింగ్స్ ఆడి తన అర్థసెంచరీ పూర్తి చేసి, పెవిలియన్ చేరాడు. 133 బంతుల్లో 50 పరుగులు చేశాడు. పంత్ 17, అశ్విన్ 46, థాకూర్ 0, షమీ 9, సిరాజ్ 1 పరుగులు చేసి ఔటయ్యారు. బుమ్రా 14 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడ, ఒలివర్ తలో మూడు వికెట్లు, మార్కో జాన్సెన్ 4 వికెట్లు పడగొట్టారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన దక్షిణాఫ్రికా టీం 1 వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. మహ్మద్ షమీ బౌలింగ్‌లో ఐడెన్ మార్క్రెమ్ ఎల్బీగా పెవిలియన్ చేరాడు.


Tags:    

Similar News