చరిత్రలో ఇది రెండో రికార్డు!

ఆసీస్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు అరుదైన ఘనతను సాధించింది. ఆ జట్టుకు చెందిన టాప్ 5 బాట్స్ మెన్స్ ( వార్నర్, ఫించ్, స్మిత్, లబుషేన్, మ్యాక్స్ వెల్ ) 50+పరుగులు చేశారు.

Update: 2020-11-29 09:56 GMT

ఆసీస్, భారత్ జట్ల మధ్య జరుగుతున్న రెండో వన్డేలో ఆస్ట్రేలియా జట్టు అరుదైన ఘనతను సాధించింది. ఆ జట్టుకు చెందిన టాప్ 5 బాట్స్ మెన్స్ ( వార్నర్, ఫించ్, స్మిత్, లబుషేన్, మ్యాక్స్ వెల్ ) 50+పరుగులు చేశారు. గతంలో భారత్ తో 2013లో జైపూర్ లో జరిగిన వన్డేలో కూడా ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లు ఈ రికార్డు నమోదు చేశారు. దీనితో రెండోసారి ఈ రికార్డు నమోదు చేసినట్టు అయింది. అటు ఈ మ్యాచ్ లో ఆసీస్ జట్టు కేవలం నాలుగు వికెట్లను కోల్పోయి 389 పరుగులు చేసింది. భారత్ పైన కూడా ఆసీస్ కి ఇది అత్యధిక స్కోర్ కావడం విశేషం! ఆరోన్‌ ఫించ్‌(60), డేవిడ్‌ వార్నర్‌(83), స్మిత్‌(104), మార్నస్‌ లబుషేన్‌(70),మాక్స్‌వెల్‌ (63) పరుగులు చేశారు. ఇక 390 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు 24 ఓవర్లకు గాను మూడు వికెట్లను కోల్పోయి 156 పరుగులు చేసింది. 

Tags:    

Similar News