Tokyo Olympics: మీరాబాయి చానుకు గోల్డ్ మెడ‌ల్ వ‌చ్చే చాన్స్‌.. ఎందుకో తెలుసా..!

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి మెడ‌ల్ సాధించిపెట్టిన వెయిట్ లిఫ్ట‌ర్ మీరాబాయి చానుకు గోల్డ్ మెడ‌ల్ వ‌చ్చే ఛాన్స్ ఉంది.

Update: 2021-07-26 10:30 GMT

Tokyo Olympics: మీరాబాయి చానుకు గోల్డ్ మెడ‌ల్ వ‌చ్చే చాన్స్‌.. ఎందుకో తెలుసా..!

Tokyo Olympics: టోక్యో ఒలింపిక్స్‌లో ఇండియాకు తొలి మెడ‌ల్ సాధించిపెట్టిన వెయిట్ లిఫ్ట‌ర్ మీరాబాయి చానుకు గోల్డ్ మెడ‌ల్ వ‌చ్చే ఛాన్స్ ఉంది. వెయిట్ లిఫ్టింగ్‌లో భారత క్రీడాకారిణి మీరాబాయి చాను వెండి పతకం గెలిచిన సంగతి తెలిసిందే. చైనా క్రీడాకారిణి జీహుహో తొలిస్థానంలో నిలిచి బంగారు పతకం గెలుచుకుంది. కాగా, చైనా క్రీడాకారిణి జీహుహోను డోపింగ్ టెస్టు కోసం పంపాలని నిర్వాహకులు భావిస్తున్నారనే వార్తలు వెల్లడవుతున్నాయి.

దీనికోస‌మే ఆమెను టోక్యోలోనే ఉండాల్సిందిగా ఇప్ప‌టికే ఆదేశించారు. ఒక‌వేళ ఆమె డోప్ టెస్ట్‌లో విఫ‌ల‌మైతే మాత్రం రెండోస్థానంలో ఉన్న మీరాబాయికి ఆ గోల్డ్ మెడ‌ల్ ద‌క్కుతుంది. ఈ ఈవెంట్‌లో చాను మొత్తం 202 కేజీల బ‌రువు ఎత్త‌గా హౌ 210 కేజీలు ఎత్తి గోల్డ్ గెలిచింది. ఇండోనేషియా వెయిట్‌లిఫ్ట‌ర్ ఐసా విండీ కాంటికా బ్రాంజ్ మెడ‌ల్ సొంతం చేసుకుంది. 

Tags:    

Similar News