Tokyo Olympics: క‌రోనా ఉన్నా.. లేకున్నా.. ఒలంపిక్స్ అప్పుడే..

Tokyo Olympics: కరోనా మ‌హామ్మారి ప్ర‌పంచ‌దేశాల‌కు వ‌ణుకు పుట్టిస్తుంది. ఈ వైర‌స్ ప్రభావం అనేక రంగాలపై పడింది. అలాగే క్రీడా రంగంపై కూడా దీని ప్రభావం ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టోక్యో ఒలంపిక్స్ తో సహా అన్ని అంతర్జాతీయ క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి

Update: 2020-09-07 12:24 GMT

Tokyo Olympics Games

Tokyo Olympics: కరోనా మ‌హామ్మారి ప్ర‌పంచ‌దేశాల‌కు వ‌ణుకు పుట్టిస్తుంది. ఈ వైర‌స్ ప్రభావం  అనేక రంగాలపై పడింది. అలాగే  క్రీడా రంగంపై కూడా దీని ప్రభావం ఉంది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన టోక్యో ఒలంపిక్స్ తో సహా అన్ని అంతర్జాతీయ క్రీడా టోర్నీలు వాయిదా పడ్డాయి. అయితే ఈ వాయిదా పడిన ఒలంపిక్స్ వచ్చే ఏడాది జులై 23న ప్రారంభమవుతాయని ఇంటర్నేషనల్ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) వైస్‌ ప్రెసిడెంట్ జాన్‌ కోట్స్‌ స్పష్టం చేశారు.

అప్పటివరకు కరోనా వైరస్ ఉన్న, లేకున్నా ఈ ఆటలు మాత్రం తప్పకుండా జరుగుతాయి అన్నారు. కేవలం వరల్డ్ వార్స్ జరిగిన సమయం లో తప్ప ఇప్పటివరకు ఈ క్రీడలు వాయిదా పడలేదు. కాబట్టి వచ్చే ఏడాది వరకు కరోనా కు వ్యాక్సిన్ వచ్చిన రాకున్నా ఈ ఆటలు మాత్రం తప్పకుండా జరుగుతాయి. ఈ ఒలంపిక్స్ కరోనా ను జయించే క్రీడలు అవుతాయి అని తెలిపారు. ఇక ఇప్పటికే భారత్ లో అథ్లెట్లు అందరూ సంసిద్ధంగా ఉండాల‌ని తెలిపారు.

సునామి వినాశనం తరవాత పునర్నిర్మాణ క్రీడలు అనే థీమ్‌తో ముందుకెళ్తున్నాం. ఇవి కరోనాను జయించే క్రీడలు కానున్నాయి. చీకట్లను తరిమికొట్టే వెలుగుకు దగ్గర్లో ఉన్నాం' అని జాన్‌ కోట్స్ ఆశాభావం వ్యక్తం చేశారు. జపాన్ సరిహద్దులు ఇప్పటికీ మూసివేయబడ్డాయి. సందర్శకులకు ఇంకా ప్రవేశం లేదు.

2011లో భూకంపం, సునామి జపాన్‌లో అల్లకల్లోలం సృష్టించాయి. ఆ విపత్తు నుంచి కోలుకొని ఈ అంతర్జాతీయ క్రీడలకు జపాన్ దేశం సిద్ధంగా ఉందని ఈ థీమ్ అర్థం. విదేశీ సందర్శకుల ప్రయాణాలపై జపాన్‌ ఇంకా ఆంక్షలు కొనసాగిస్తోంది. వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడానికి ఎంత సమయం పడుతుందో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. నెలలు కావొచ్చు, సంవత్సరాలు పట్టొచ్చు. ఈ తరుణంలో క్రీడల నిర్వహణ సాధ్యమైనా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో ఎక్కువ మంది మరోసారి విశ్వ క్రీడలను వాయిదా వేయాలని కోరుకున్నారట. 

Tags:    

Similar News