Hyderabad: భారత్-ఆసీస్ టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ప్రారంభం.. టికెట్లు కొనేందుకు వచ్చేవారికి ఆధార్ కార్డు తప్పనిసరి
Hyderabad: జింఖానా గ్రౌండ్‌కు భారీగా తరలివస్తున్న అభిమానులు.. టికెట్ల కోసం తెల్లవారుజామునుంచే క్యూలైన్లలో పడిగాపులు
Hyderabad: భారత్-ఆస్ట్రేలియా టీ20 మ్యాచ్ టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. సికింద్రాబాద్ జింఖానా గ్రౌండ్‌లో కౌంటర్ ఏర్పాటు చేసి, టికెట్ విక్రయాలు జరుపుతున్నారు. ఇవాళ సాయంత్రం 5 గంటల వరకు టికెట్ల అమ్మకం కొనసాగనుంది. ఇక.. మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్‌కు క్రికెట్ అభిమానులు భారీగా తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే టికెట్ల కోసం క్యూలైన్లలో పడిగాపులు కాస్తున్నారు. దీంతో గ్రౌండ్ పరిసరాల్లో కోలాహలం నెలకొంది. ఒక్కొక్కరికి రెండేసి టికెట్లను మాత్రమే అమ్మాలనే నిబంధన HCA విధించింది. అలాగే.. టికెట్లు కొనేందుకు వచ్చేవారికి ఆధార్ కార్డు తప్పనిసరి చేసింది. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా.. జింఖానా గ్రౌండ్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ నెల 25న ఉప్పల్ స్టేడియంలో భారత్ - ఆస్ట్రేలియా మధ్య చివరి టీ20 మ్యాచ్ జరగనుంది.