IND vs SA: దక్షిణాఫ్రికాపై టీమిండియా ఘనవిజయం
IND vs SA: 8 వికెట్ల తేడాతో గెలుపొందిన రోహిత్ సేన
IND vs SA: తిరువనంతపుర వేదికగా జరిగిన క్రికెట్లో టీమిండియా విజయం సాధించింది. తొలిటీ20 మ్యాచ్‌లో బ్యాటింగ్‌కి దిగిన దక్షిణాఫ్రికాను ఆరంభంలో టీమిండియా బౌలర్ అర్షదీప్ సింగ్ కోలుకోని దెబ్బతీశాడు. రెండో ఓవర్ వేసిన అర్షదీప్ సింగ్ అద్భుతమైన బంతుల్ని సంధించి కీలకమైన వికెట్లను పడగొట్టాడు. ఒకే ఓవర్లో మూడు వికెట్లు తీయడంతో దక్షిణాఫ్రికా పీకల్లోతు కష్టాల్లో పడింది. పరుగులు సాధించేందుకు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన దక్షిణాఫ్రికా 106 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా తరఫున కేశవ్ మహరాజ్ 41 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మార్కరమ్ 25 పరుగులు, పార్నెల్ 24 పరుగులతో నిలిచారు.
107 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకిదిగిన టీమిండియాకు శుభారంభం దక్కలేదు. ప్రారంభంలోనే కెప్టన్ రోహిత్ శర్మ పెవీలియన్ బాట పట్టాడు. మరికాసేపటికే విరాట్ కోహ్లీ 3 పరుగులతో ఔటయ్యాడు. క్రీజులో ఉన్న లోకేశ్ రాహుల్‌కు తోడైన సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగారు. లోకేశ్ రాహుల్ 51 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 50 పరుగులతో అజేయంగా నిలిచారు. ఇరువురూ అర్ధశతకాలను పూర్తిచేసుకోవడంతోపాటు జట్టును విజయతీరం చేర్చారు. దక్షిణాఫ్రికాను తక్కువ పరుగులకు కట్టడి చేయడంలో కీలక పాత్రపోషించిన బౌలర్ అర్షదీప్ సింగ్‌కు ప్లేయర్ ఆఫ్‌ది మ్యాచ్ అవార్డు దక్కింది.